PM Modi: ఖతర్‌ చేరుకున్న నరేంద్ర మోదీ.. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్న ప్రధాని

ఇక ఆ తర్వాత అహ్లాన్‌ మోదీ పేరిట అబుదాబిలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతరం అబుదాబిలో స్వామినారాయణ్‌ నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు. ఇదిలా అనంతరం ఖతర్‌ బయలు దేరిన మోదీ తాజాగా...

PM Modi: ఖతర్‌ చేరుకున్న నరేంద్ర మోదీ.. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్న ప్రధాని
Pm Modi

Updated on: Feb 15, 2024 | 7:23 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈలో బిజీబిజీగా గడుపుతున్నారు. తొలిరోజు (మంగళవారం) అబుదాబి చేరుకున్న ప్రధాని అక్కడ యూఏఈ అధ్యక్షుడుల మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌తో రెండు దేశాల దైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 2015 నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ 7 సార్లు యూఏఈలో పర్యటించడం విశేషం.

ఇక ఆ తర్వాత అహ్లాన్‌ మోదీ పేరిట అబుదాబిలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతరం అబుదాబిలో స్వామినారాయణ్‌ నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు. ఇదిలా అనంతరం ఖతర్‌ బయలు దేరిన మోదీ తాజాగా ఖతర్‌ రాజధాని దోహాలోని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి అక్కడి దేశాధ్యక్షులు, అధికారులు స్వాగతం పలికారు. ఇఇదలా ఉంటే గూఢచర్య ఆరోపణలతో అరెస్ట్ చేసిన 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారులను విడుదల చేసిన సందర్భంగా ప్రధాని ఖతర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఖతార్‌ పర్యటనలో భాగంగా ఎమిర్ షేక్ తమీమ్‌బిన్ హమద్ అల్ థానీ సహా ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రధాని చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఏయే అంశాలు చర్చకు వస్తాయన్నది ఆసక్తిగా మారింది.

 

ఇదిలా ఉంటే.. అల్ దహ్రా సంస్థలో పనిచేసిన భారత దేశ పౌరులు గూఢచర్యం ఆరోపణలపై ఆగస్టు 2022లో అరెస్టైన విషయం తెలిసిందే. అక్టోబర్ 26, 2023న ఖతార్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ నేవీ వెటరన్‌లకు మరణశిక్ష విధించడం దేశ వ్యాప్తంగా సంచనలంగా మారింది. అయితే అనంతరం మరణ శిక్షను జైలు శిక్షగా మార్చింది. ఆ తర్వాత భారత్‌ దౌత్యంతో వారి విడుదలకు మార్గం సుగుమమైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..