AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం

న్యూయార్క్‌లోని లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్న ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆదేశాలను పట్టించుకోకుండా వాహనం ముందుకు సాగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం
Laguardia Airport Acciden
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2026 | 10:56 AM

Share

న్యూయార్క్ నగరంలోని లాగార్డియా విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం షాక్‌కు గురి చేస్తోంది. రన్‌వేపై ప్రయాణానికి సిద్ధమవుతున్న ఓ విమానాన్ని… అగ్నిమాపక వాహనం వెళ్లి ఢీకొనడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా అధికారులు ధృవీకరించలేదు. పలువురు తీవ్రంగా గాయడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫైరింజన్ ఢీకొన్న తాకిడికి విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ఘటనపై అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ, ప్రమాదాల పరిశీలనా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రమాదానికి సంబంధించిన కీలక శబ్ద రికార్డు కూడా బయటకు వచ్చింది. విమాన రాకపోకల నియంత్రణ కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ, అగ్నిమాపక వాహనం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆగమని పలుమార్లు హెచ్చరించినా వాహనం నిలిచిపోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు సంస్థలు ఉగ్రదాడి కోణంలో కూడా పరిశీలిస్తున్నాయి. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రమాదం అనంతరం లాగార్డియా విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేయగా, రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికుల్లో తీవ్ర భయం నెలకొంది.

Follow Us
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
పుల్ షాట్‌తోనే పిచ్చెక్కిస్తారయ్యో.. ఫస్ట్ పేరు చూస్తే పూనకాలే..!
పుల్ షాట్‌తోనే పిచ్చెక్కిస్తారయ్యో.. ఫస్ట్ పేరు చూస్తే పూనకాలే..!
కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం
కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం
బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..
బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..
అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్.. ఫోన్‌ల నుండి ఏసీల వరకు 80 శాతం తగ్గింపు
అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్.. ఫోన్‌ల నుండి ఏసీల వరకు 80 శాతం తగ్గింపు
జాతకాలను ఎక్కువగా నమ్ముతాను.. అందుకే 10 వేలు ఖర్చు చేస్తా..
జాతకాలను ఎక్కువగా నమ్ముతాను.. అందుకే 10 వేలు ఖర్చు చేస్తా..
విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?
విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?
ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. రంగం భవిష్యవాణి ఇదే
ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. రంగం భవిష్యవాణి ఇదే