Philippines: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా నియంత కుమారుడు.. జూనియర్‌ మార్కోస్‌ ఘన విజయం..

ఆయన తండ్రి ఓ నియంత.. ప్రజల తిరుగుబాటుతో దేశం విడిచిపారిపోయాడు.. విచిత్రంగా ఆ నియంత కొడుకునే ఇప్పుడు ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు ఫిలిప్పీన్స్‌ ప్రజలు..

Philippines: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా నియంత కుమారుడు.. జూనియర్‌ మార్కోస్‌ ఘన విజయం..
Ferdinand Marcos Jr

Updated on: May 12, 2022 | 7:54 AM

Philippines President: ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష పదవికి తాజాగా జరిగిన ఎన్నికల్లో మార్కోస్‌ జూనియర్‌ ఘన విజయం సాధించారు.. ఈయన గెలుపుతో ప్రపంచం నివ్వెరపోయింది.. కారణం ఆయన తండ్రి ఒకనాటి నియంత.. ఫెర్డినాండ్‌ మార్కోస్‌ పేరు వింటే గుర్తుకు వచ్చేది రక్త చరిత్రే.. 1965 నుంచి 1986 వరకూ ఫిలిప్పీన్స్‌ను నియంతలా పాలించాడు. అధికారంలో ఉన్న సమయంలో పదివేల మంది ప్రత్యర్థులను జైలులో పెట్టి హింసించి చంపించిన చరిత్ర ఆయనది.. ఫెర్డినాండ్‌ ఆగడాలు భరించలేక ఫిలిప్పీన్స్‌ ప్రజలు తిరుగుబాటు చేశారు.. దీంతో ఆయన దేశం వదిలి అమెరికా పారిపోయాడు.. అక్కడే మరణించాడు.తండ్రి మరణం తర్వాత కొంత కాలానికి ఫిలిప్పీన్స్‌ చేరుకుంది ఫెర్డినాండ్‌ మార్కోస్‌ కుటుంబం.. కట్‌ చేస్తే తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఫెర్డినాండ్‌ మార్కోస్‌ కొడుకు మార్కోస్‌ (Ferdinand Marcos Jr) జూనియర్‌ ఘన విజయం సాధించాడు. తన ప్రత్యర్థి లీని రోబ్రెడోను ఓడించి 56 శాతం ఓట్లు తెచ్చుకున్నాడు.. ఒకనాటి నియంత కొడుకునే ఫిలిప్పీన్స్‌ ప్రజలు ఎన్నుకోవడం గమనార్హం.

అయితే.. తన కుటుంబాన్ని చూసి కాదు తనను.. తన పనులను చూసి ఓటు వేయండంటూ మార్కోస్‌ జూనియర్‌ చేసిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. జూన్‌ 30న ఆయన దేశాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు.. ఫిలిప్పీన్స్‌కు ఇప్పుడు పేదరికం, డ్రగ్స్‌తో పాటు అనేక అసమానతలు పీడిస్తున్నాయి.. దేశ ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మార్కోస్‌ జూనియర్‌ పై పడింది.

Also Read:

ఇవి కూడా చదవండి

European parliament: పార్లమెంట్‌లో డ్యాన్స్ ప్రదర్శన.. వైరల్ అవుతున్న వీడియో.. ప్రజల రియాక్షన్ ఇదీ..!

Sri Lanka Crisis: వారం రోజుల్లో శ్రీలంకకు కొత్త ప్రధాన మంత్రి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు గోటబయ