కాంబోడియాలో ఓ వ్యక్తి తానను మురిపెంగా పెంచుకుంటున్న సింహాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకుపోయారు. టిక్ టాక్ లో తను ఆ సింహంతో ఉన్న వీడియోలను ఆ యజమాని పోస్ట్ చేయడంతో అతని ఇంటికి వెళ్లిన అధికారులు ఆ జంతువును తీసుకుపోవడంతో ఆ యజమాని లబోదిబోమన్నాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలనీ, తన సింహాన్ని తనకు ఇప్పించాలంటూ ఏకంగా దేశ ప్రధాని హున్ సేన్ ని కోరాడు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఆయన ‘దయతో.. సింహాన్ని ఆ యజమానికి తిరిగి ఇప్పించాలని అధఃజికారులను ఆదేశించారు. దాంతో వారు మళ్ళీ దాన్ని తిరిగి అతనికి అప్పగించక తప్పలేదు.
అయితే దాన్ని బోనులో ఉంచాలని ఆదేశించారు. కాంబోడియాలో క్రూర మృగాలను ఇలా పెంపుడు జంతువులుగా [పెంచుకుంటూ ఉంటారు. ఇందుకు వారు లైసెన్స్ తీసుకోవలసి ఉంటుంది. అయితే వీటిని విచ్చల విడిగా వదిలేయరాదన్న రూల్ ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.