Pakistan: పాక్‌లో చరిత్ర సృష్టించిన హిందూ యువతి.. డాక్టర్ చదివి అసిస్టెంట్ కమిషనర్‌గా పదవి చేపట్టిన సనా

|

Feb 14, 2023 | 10:59 AM

సనా తన మొదటి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. 2016లో.. సనా..  షహీద్ మొహతర్మా బెనజీర్ భుట్టో మెడికల్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ - బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS) డిగ్రీతో యూరాలజిస్ట్‌గా పట్టభద్రురాలయ్యారు.

Pakistan: పాక్‌లో చరిత్ర సృష్టించిన హిందూ యువతి.. డాక్టర్ చదివి అసిస్టెంట్ కమిషనర్‌గా పదవి చేపట్టిన సనా
Sana Ramchand Gulwani
Follow us on

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్ , అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులైన మొదటి మహిళా హిందువుగా సనా రాంచంద్ గుల్వానీ చరిత్ర సృష్టించారు. 27 ఏళ్ల మెరిటోరియస్ సింధీ హిందూ అమ్మాయి సనా రాంచంద్ గుల్వానీ..   సింధ్ ప్రావిన్స్‌లోని షికార్‌పూర్ నగరంలో పెరిగారు. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఆఫీసర్ గా బాధత్యలను తీసుకునే ముందు.. ఆమె తన తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్‌గా పట్టా పొందారు. 2020లో సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ (CSS) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (PAS)లో చేరిన అసిస్టెంట్ కమిషనర్ హసనబ్దల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన హిందూ సమాజానికి చెందిన మొదటి మహిళ సనా రాంచంద్ గుల్వానీ నిలిచారు.

ఆమె గత వారం అటాక్ జిల్లాలోని హసనబ్దల్ నగర అసిస్టెంట్ కమిషనర్ మరియు అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది. సనా తన మొదటి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. 2016లో.. సనా..  షహీద్ మొహతర్మా బెనజీర్ భుట్టో మెడికల్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ – బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS) డిగ్రీతో యూరాలజిస్ట్‌గా పట్టభద్రురాలయ్యారు. అనంతరం సనాని అధికారిణిగా చూడాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. దీంతో ఆమె CSS పరీక్షకు ప్రిపేర్ అయింది. అయితే తాను ఇలా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ గా ఎంపికైన మొదటి వ్యక్తినో కాదో తనకు తెలియదు.. అంతేకాదు హిందువుల్లో మహిళలు ఈ CSS పరీక్షకు ప్రిపేర్ అవున్నట్లు కూడా వినలేదని సనా రాంచంద్ గుల్వానీ చెప్పారు.  అంతేకాదు  పాకిస్తాన్‌లో అన్ని రంగాలలో ఎక్కువ మంది మహిళా ప్రాతినిధ్యం అవసరమని..  ఎక్కువ మంది క్రైస్తవ, సిక్కు, హిందూ, పార్సీ అధికారులు అవసరమని పేర్కొన్నారు. సనాకు నలుగురు సోదరీమణులు ఉన్నారు. తాను మగవాడి కంటే తక్కువ అని ఎప్పుడూ భావించలేదని చెప్పారు.

పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు. అక్కడ వారు ముస్లింల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను అనుసరిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..