Fuel Prices: భారీగా పెట్రోల్ ధరల పెంపు.. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి.. ఎక్కడంటే

సాధారణంగా లీటర్ పెట్రోల్(Petrol) పై తక్కువ మొత్తంలో ధర పెరిగితేనే ఆందోళనలు చేస్తాం. పెంచిన ధరలు తగ్గించాల్సిందేనని నిరసనలూ చేస్తాం. ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రకటించేంతవరకు ఆందోళనలు విరమించం. కానీ ఆ దేశంలో మాత్రం...

Fuel Prices: భారీగా పెట్రోల్ ధరల పెంపు.. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి.. ఎక్కడంటే
Fuel Prices

Updated on: May 28, 2022 | 3:27 PM

సాధారణంగా లీటర్ పెట్రోల్(Petrol) పై తక్కువ మొత్తంలో ధర పెరిగితేనే ఆందోళనలు చేస్తాం. పెంచిన ధరలు తగ్గించాల్సిందేనని నిరసనలూ చేస్తాం. ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రకటించేంతవరకు ఆందోళనలు విరమించం. కానీ ఆ దేశంలో మాత్రం పెట్రో ఉత్పత్తులపై ధరలను భారీగా పెంచేసింది. రూపాయో, ఐదో, పది రూపాయలో కాదండోయ్.. ఏకంగా రూ.30 పెంచేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, విద్యుత్​కొరత మొదలైన సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్(Pakistan).. తమ దేశ పౌరులపై మరో పిడుగు వేసింది. అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలతో అక్కడ లీటర్​పెట్రోల్ రూ.179.85కు పెరగగా.. డీజిల్​ధర లీటర్ కు రూ.174.15 కు చేరింది. ఆర్థిక సహాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్​) పాకిస్తాన్ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ దేశ ఆర్థికమంత్రి మిఫాత్​ఇస్మైల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు దేశానికి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్​ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు.. పెట్రోల్ ధరలను భారీగా పెంచడాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అంతేకాకుండా ఇంధన ధరలు తగ్గించిన పొరుగు దేశం భారత్ పై ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్​ధరలను 20శాతం (రూ.30) పెంచింది. ఒకేసారి ఈ స్థాయిలో ధరలు పెంచడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఇమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి