Terror Financing Case: ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు క్లీన్‌చిట్‌.. నిర్దోషులుగా ప్రకటించిన లాహోర్ కోర్టు

|

Nov 07, 2021 | 11:57 AM

JUD - Terror Financing Case: ఉగ్రవాదులకు నిధుల సమకూర్చని కేసులో ముంబై దాడుల కీలక సూత్రధారి, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అనుచరులను పాకిస్థాన్‌లోని

Terror Financing Case: ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు క్లీన్‌చిట్‌.. నిర్దోషులుగా ప్రకటించిన లాహోర్ కోర్టు
Hafiz Saeed
Follow us on

JUD – Terror Financing Case: ఉగ్రవాదులకు నిధుల సమకూర్చని కేసులో ముంబై దాడుల కీలక సూత్రధారి, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అనుచరులను పాకిస్థాన్‌లోని లాహోర్ కోర్టు శనివారం నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత జమాతుల్ దవా (JUD) కు చెందిన ఆరుగురు నేతలను లాహోర్ కోర్టు నిర్దోషులుగా పేర్కొంటు తీర్పునిచ్చింది. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలో జేయూడీ సంస్థ ఉగ్రకార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇది లష్కరే తొయిబాకు (LET) అనుబంధ సంస్థగా ఉంది. ఈ సంస్థ ఉగ్ర కార్యకాలపాలకు ఉగ్రవాదులకు నిధులు సమకురుస్తుందన్న అభియోగాలపై పలు కేసులు నమోదయ్యాయి. టెర్రరిస్టు సంస్థలకు నిధులు సమకూరస్తున్న ఆరోపణల నేపథ్యంలో ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్) పాకిస్థాన్ ను ‘గ్రే’ లిస్టులో పెట్టింది. ప్రపంచ FATF సంస్థ ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైనందుకు పాకిస్తాన్‌ను ఆ సంస్థ ‘గ్రే లిస్ట్’లో ఉంచిన తర్వాత ఈ తీర్పు రావడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినట్లేనని పలువురు పేర్కొ్ంటున్నారు.

ఇదే కేసులో.. ఈ ఏడాది ఏప్రిల్‌లో లాహోర్‌ యాంటీ టెర్రరిజమ్‌ కోర్టు జేయూడీకి చెందిన ఐదుగురు అగ్రనేతలకు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వారిలో మాలిక్‌ జాఫర్‌ ఇక్బాల్‌, యాహ్యా ముజాహిద్‌, నసారుల్లాహ్‌, సమియుల్లాహ్, ఉమర్‌ బహదూర్‌ ఉన్నారు. హఫీజ్‌ సయిద్‌ బావమర్ధి అయిన హఫీజ్‌ అబ్దుల్‌ రహ్మన్‌ మక్కికి ఆరు నెలల శిక్ష విధించిన విషయం తెలిసిందే. వీరంతా టెర్రర్ ఫైనాన్సింగ్‌కు పాల్పడినట్లు పంజాబ్ పోలీసులు, ఉగ్రవాద నిరోధక విభాగం (CTD) తెలిపింది. అయితే నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో అల్-అన్‌ఫాల్ ట్రస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని జూడ్ నేతల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కేసులో పేర్కొన్న విధంగా అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమవడంతో.. ప్రధాన న్యాయమూర్తి ముహమ్మద్ అమీర్ భట్టి, జస్టిస్ తారిఖ్ సలీమ్ షేక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శనివారం ఆరుగురు జెయుడి నాయకులను నిర్ధోషులుగా తెలిపింది.

Also Read:

మేకప్‌ లేకుండా భార్యను చూసి షాకైన భర్త.. భార్య తనను మోసం చేసిందంటూ.. విడాకుల కోసం కోర్టుకు..

Human Tail: అప్పుడే పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. 12 సెం.మీ తోకతో బాలుడి జననం.. ఎక్కడంటే..?