Pakisthan Floods: భారత్ నుంచి దోమతెరల కొనుగోలుకు పాక్ ప్రయత్నాలు.. మరోవైపు కాశ్మీర్ విషయంలో..

పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి న్యూయార్క్ చేరుకున్నారు. అటువంటి పరిస్థితిలో, వరద పరిస్థితి గురించి చర్చించే బదులు, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడమే సరైనదని ఆయన భావించారు.

Pakisthan Floods: భారత్ నుంచి దోమతెరల కొనుగోలుకు పాక్ ప్రయత్నాలు.. మరోవైపు కాశ్మీర్ విషయంలో..
Pakisthan Floods

Updated on: Sep 23, 2022 | 3:12 PM

Pakisthan Floods: వరదల బీభత్సంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో పరిస్థితి ఇంకా మెరుగుపడడం లేదు. వరదల తర్వాత ఏర్పడిన బురదతో దోమల బెడద ఎక్కువైంది. దీంతో దోమల వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో..  పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు భారతదేశం నుండి  71 లక్షల దోమతెరలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతి కోరారు. ఇదే విషయాన్నీ భారత ప్రభుత్వానికి గురువారం సమాచారం అందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మలేరియా ‘ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ ‘ వేరియంట్‌తో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో ఈ వ్యాధితో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి.

NHS, R&C అధికారి నివేదికలో.. ‘భారతదేశం నుండి సుమారు 71 లక్షల దోమతెరలను కొనుగోలు చేయడానికి నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS), నియంత్రణ మరియు సమన్వయం (R&C) వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి అనుమతి కోరింది. జాతీయ మలేరియా నియంత్రణ కార్యక్రమానికి ప్రధాన దాత అయిన గ్లోబల్ ఫండ్, భారతదేశం నుండి దోమతెరల కొనుగోలు కోసం పాకిస్తాన్‌కు తక్షణ ప్రాతిపదికన నిధులు అందించడానికి ముందుకొచ్చింది.’

వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న దేశ సమీకరణాలు 
పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వరదల బీభత్సం కారణంగా ఇప్పటివరకు 1,500 మందికి పైగా మరణించారు. మరోవైపు నీటి వల్ల, దోమల వల్ల అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. పాకిస్థాన్‌లో వరదల కారణంగా ఇన్‌ఫ్రా, ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం వాటిల్లింది. లక్షలాది మంచి చిన్నారులు అస్వస్తత, ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ, పాకిస్తాన్‌లో విరిగిన ఇళ్ళు కారణంగా నిరాశ్రయులైన చాలా మంది ప్రజలు షెల్టర్లలో నివసించవలసి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంకా మెరుగుపడని పాకిస్థాన్ పరిస్థితి:
ఇంత విపత్కర పరిస్థితులు ఎదురైనా పాక్ చర్యలలో ఎలాంటి మెరుగుదల లేదు. పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి న్యూయార్క్ చేరుకున్నారు. అటువంటి పరిస్థితిలో, వరద పరిస్థితి గురించి చర్చించే బదులు, కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడమే సరైనదని ఆయన భావించారు. గ్లోబల్ లీడర్ల సమ్మేళనం ఉన్న చోట, వారు తమ దేశం విపత్తు వల్ల ప్రభావితమైన ప్రజల గురించి ఆలోచించాలి. కానీ అది విస్మరించి ఇప్పటికీ భారత్, కాశ్మీర్ వంటి అంశాలను లేవనెత్తింది. అయితే కాశ్మీర్‌, జమ్మూ, లడఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని భారత్‌ తన వైఖరిని స్పష్టం చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..