AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైఫుల్లా సంతాప సభలో మరోసారి విషం చిమ్మిన పాక్.. భారత్‌పై ఉగ్రవాదులను రెచ్చగొట్టిన ఆర్మీ..!

భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిన లష్కరే తోయిబా కమాండర్ రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లాను ఆదివారం (మే 18) గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అతని మరణం తరువాత, పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య సంబంధం మరోసారి తెరపైకి వచ్చింది. సైఫుల్లా మరణం పట్ల హఫీజ్ సయీద్ కుమారుడు తన్హా సయీద్ పార్టీ పాకిస్తాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (PMML) సంతాప సభను నిర్వహించింది.

సైఫుల్లా సంతాప సభలో మరోసారి విషం చిమ్మిన పాక్.. భారత్‌పై ఉగ్రవాదులను రెచ్చగొట్టిన ఆర్మీ..!
Abu Saifullah Condolence Meeting
Balaraju Goud
|

Updated on: May 21, 2025 | 6:19 PM

Share

భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిన లష్కరే తోయిబా కమాండర్ రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లాను ఆదివారం (మే 18) గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అతని మరణం తరువాత, పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య సంబంధం మరోసారి తెరపైకి వచ్చింది. సైఫుల్లా మరణం పట్ల హఫీజ్ సయీద్ కుమారుడు తన్హా సయీద్ పార్టీ పాకిస్తాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (PMML) సంతాప సభను నిర్వహించింది.

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని మట్లీ ప్రాంతంలో సైఫుల్లాపై కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో PMML సంతాప సభ నిర్వహించింది. ఉగ్రవాది సైఫుల్లా మరణాన్ని అమరవీరుడిగా అభివర్ణించి, భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హఫీజ్ సయీద్ కొడుకు పార్టీలోని చాలా మంది వ్యక్తులతోపాటు లష్కరే తోయిబా, జమాత్-ఉద్-దవా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నేతలు పాల్గొన్నారు. ఇది పాకిస్తాన్ రాజకీయ పార్టీలు సైన్యంతో కలిసి ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్నాయని మరోసారి రుజువు చేస్తుంది.

భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలకు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించారు. అతను పాకిస్తాన్ మర్కజ్ ముస్లిం లీగ్ నాయకుడు కూడా. పాకిస్తాన్ అతన్ని ఒక సాధారణ కుటుంబ వ్యక్తిగా అభివర్ణించింది. పాకిస్తాన్ సైన్యంలోని చాలా మంది ఉన్నతాధికారులు రవూఫ్ వెనుక నిలబడ్డారు. ఉగ్రవాదులకు అమరవీరుల హోదా ఇచ్చింది. హఫీజ్ అబ్దుల్ రవూఫ్ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు. అమెరికా కూడా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది.

పాకిస్తాన్ కొత్త ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారంగా మారింది. మసూద్ అజార్, హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్, ఇప్పుడు ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి కొత్త వ్యక్తులను సిద్ధం చేస్తోంది.

ఇదిలావుంటే, లష్కరే ఉగ్రవాది అబూ సైఫుల్లా నేపాల్ ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడు. అతను పాకిస్తాన్‌లో ఉంటూ లష్కరే కోసం ఉగ్రవాదులను నియమించుకునేవాడు. ఆపరేషన్ సిందూర్ తర్వాత , పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదుల భద్రతను పెంచాయి. భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్‌లోకి ప్రవేశించి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసినప్పుడు, లష్కరే సైఫుల్లాను అజ్ఞాతంలో ఉండమని కోరింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..