Omicron Variant: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మరోసారి విజృంభిస్తోంది. ఇక అగ్నేయాసియాలో కరోనా మహమ్మారి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక సూచనలు చేసింది. కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నా.. అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్‌సింగ్ వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకున్నట్లయితే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌లలో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా, ఇతర వేరియంట్లు కూడా ఉన్నాయని, ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిదన్నారు.
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండదని నిపుణులు సూచిస్తున్నా..నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ప్రస్తుతం కరోనాతో పాటు కొత్త వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయని,ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుందని సూచించారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ వేరింయట్ ప్రభావం తక్కువగా ఉన్నా.. తర్వాత బలంగా మారి ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టకడంలో నిబంధనలు పాటించాలని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి: