Omicron: గత ఏడాదికిపై ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో కట్టడిలోకి రాకముందే మరో వేయింట్ భయాందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ అందరిలో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే 30 దేశాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఒమిక్రాన్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, కొత్త పుట్టుకొచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ కోసం ఔషధాన్ని గుర్తించినట్లు బ్రిటన్ తెలిపింది. ఈ ఔషధం పేరు ‘సోట్రోవిమాబ్’ అని వెల్లడించింది.
ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్ ఉపయోగించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవిడ్ సోకిన వారికి ఈ ఇంజెక్షన్‌తో యాంటీబాడీ చికిత్స చేయగా, వారిలో మంచి ఫలితాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఈ ఒమిక్రాన్ కోసం వచ్చిన ఇంజెక్షన్‌తో 79 శాతం మరణించే ప్రమాదం తగ్గినట్లు గుర్తించింది.
అయితే కరోనా కోసం వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక.. చాలా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునే సమయంలో మరో వేరియంట్ పుట్టుకొచ్చింది ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కొత్తవేరియంట్‌పై భయాందోళన చెందుతున్న నేపథ్యంలో బ్రిటన్ ఈ ఔషధాన్ని తయారు చేయడం ఊరట కలిగించే అంశమనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఔషధాన్ని పరిశోధకులు ముందుగా నరాల ద్వారా ఎక్కించగా, కరోనా వైరస్ ఈ ‘సోట్రోవిమాబ్’ మెడిసిన్ మానవ కణాల్లో ప్రవేశిచండాన్ని సమర్థంగా అడ్డుకుందని పరిశోధకులు చెబుతున్నారు.
కరోనా సోకిన వారికి ఈ సోట్రోవిమాబ్ మెడిసిన్ మొదటి డోసుతోనే మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోగా ఈ ఔషధాన్ని అందించాలని బ్రిటన్‌కు చెందిన ది మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRAఏ) వెల్లడించింది. అయితే ఈ వేరియంట్ 30 దేశాలలో గుర్తించారు. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలలో కొత్త వేరియంట్ గుర్తించారని చెప్పింది.
కొత్త Omicron వేరియంట్ ప్రస్తుతం ప్రబలంగా ఉన్న డెల్టా వేరియంట్, బీటా స్ట్రెయిన్ కంటే మూడు రెట్లు అధిక ప్రభావం చూపుతుందని దక్షిణాఫ్రికా ఆరోగ్య సంస్థ తెలిపింది. కొత్త కోవిడ్ -19 వేరియంట్‌ను మొదటగా గుర్తించిన దక్షిణాఫ్రికా వైద్యుడు, ఇప్పటివరకు పరిశీలించిన రోగులు డెల్టా వేరియంట్ ద్వారా ప్రభావితమైన వారి కంటే ‘తేలికపాటి’ లక్షణలు ఉన్నాయని, అలసట, శరీర నొప్పులు మరియు నొప్పులు ఒమిక్రాన్ సోకిన వారిలో కొన్ని లక్షణాలని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్‌గా ఉన్న డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ చెప్పారు.
ఇవి కూడా చదవండి: