Pope Francis: పోప్ మరణం తర్వాత ఏం జరుగుతోంది? వాటికన్ సిటీ అంతం గురించి ఆస్ట్రాలజర్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే..?
ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు నోస్ట్రడామస్ పోప్ మరణం, వాటికన్ నగరం నాశనం అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన పుస్తకంలో వృద్ధుడైన పాప్ మరణాంతరం యువ రోమన్ వ్యక్తి పాప్ గా నియమితుడవుతాడని, అతను పెద్దగా ప్రభావం చూపకపోయినా దీర్ఘకాలం పాప్ గా కొనసాగుతుందని పేర్కొన్నట్లు. పవిత్ర రోమన్ చర్చి చివరి హింసలో పీటర్ రోమన్ పాప్ గా ఉంటాడని, ఆ తర్వాత వాటికన్ నగరం నాశనం అవుతుందని నోస్ట్రాడమస్ అంచనా వేశారు. ప్రస్తుత పాప్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వాటికన్ ప్రతినిధులు తెలిపారు.

ప్రస్తుతం పోప్ ప్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆయన గురించి ప్రముఖ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్, సోత్సేయర్ నోస్ట్రాడమస్‌గా ప్రసిద్ధి చెందిన మైఖేల్ డీ నోస్ట్రెడేమ్ తన పుస్తకాల్లో ఏమైనా ప్రస్తవించి ఉంటారా? అని నిపుణులు ఆయన పుస్తకాలను తిరగేస్తున్నారు. నోస్ట్రాడమస్ అనే విషయాలను ముందే అంచనా వేశారని కొంతమంది చాలా బలంగా విశ్వసిస్తారు. లండన్‌లో మహా అగ్ని ప్రమాదం, అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం, 9/11 ఉగ్రదాడి, కోవిడ్-19, జపాన్ భారీ భూకంపం ఇలా చరిత్ర చూసిన అనేక విలయాల గురించి నోస్ట్రాడమస్ ముందే చెప్పినట్లు కొందరు నమ్ముతారు.
ఆయన 1555లో ఆయన రచించిన లెస్ ప్రొపెటీస్ అనే పుస్తకంలో ప్రస్తుత పోప్ మరణం గురించి, ఆయన తర్వాత ఎవరు పోప్ అవుతారు, వాటికన్ సిటీ నాశనం ఇలా అనేక విషయాలను ఆయన అప్పుడే అంచనా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోప్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆ వార్తలు మరింత ప్రచారంలో ఉన్నాయి. జోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. నోస్ట్రాడమస్ ఆయన పుస్తకంలో “చాలా వృద్ధుడైన పోప్ మరణం తర్వాత యుక్త వయసులో ఉన్న రోమన్ వ్యక్తి పోప్‌గా నియమితుడవుతాడు. అతను పెద్దగా ప్రభావం చూపకపోయినా.. చాలా కాలం పోప్‌గా కొనసాగుతాడు’ అని రాసినట్లు చెబుతున్నారు.
అలాగే పవిత్ర రోమన్ చర్చి చివరి హింసలో పీటర్ ది రోమన్ పోప్‌గా ఉంటాడు. అతనే క్రైస్తవులకు మార్గదర్శిగా ఉంటాడు. ఆ తర్వాత ఏడు కొండల నగరం(వాటికన్ సిటీ) నాశనం చేయబడుతుంది.” అని రాసి ఉన్నట్లు జోతిష్య నిపుణులు చెబుతున్నారు. సో.. నోస్ట్రాడమస్ చెప్పిన దాని ప్రకారం.. పోప్ మరణం తర్వాత ఓ మధ్య వయసు గల రోమన్ పోప్‌గా మారుతారు. అలాగే పవిత్ర రోమ్ చర్చికి పీటర్ ది రోమన్ పోప్ అయిన తర్వాత వాటికన్ సిటీ నశిస్తుందని అంచనా వేశారు. మరోవైపు ప్రస్తుతం పోప్ ప్రాన్సిస్ ఆరోగ్యం కుదుట పడుతుందని వాటికన్ సిటీ ప్రతినిధులు వెల్లడించారు. పోప్ మెల్లమెల్లగా కోలుకుంటున్నారని, సాయంత్రం ఆయన పనులు ఆయనే చేసుకున్నారని, అలాగే గాజాలోని పారిష్‌కు ఫోన్ చేసిన మాట్లాడినట్లు వాటికన్ న్యూస్ తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
