సునామీలను పుట్టించగల ఆయుధాన్ని తయారుచేసిన ఉత్తర కొరియా.. కిమ్ జోన్ హెచ్చరిక
కొత్త ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ప్రపంచంలో ఉత్తర కొరియా ప్రకంపనలు సృష్టించడం మాములే. ఇప్పడు తాజాగా మరో అణు ఆయుధంతో ముందుకొచ్చింది. ఏకంగా సునామినే పుట్టించగల అండర్ వాటర్ డ్రోన్ ను తయారు చేశారు.

కొత్త ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ప్రపంచంలో ఉత్తర కొరియా ప్రకంపనలు సృష్టించడం మాములే. ఇప్పడు తాజాగా మరో న్యూక్లియర్ ఆయుధంతో ముందుకొచ్చింది. ఏకంగా సునామినే పుట్టించగల అండర్ వాటర్ డ్రోన్ ను తయారు చేశారు. అయితే ఈ ఆయుధాన్ని విజయవంతగా పరిక్షించామని ఉత్తర కొరియా ప్రకటించించింది.ఈ ఆయుధం వల్ల భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకశ్రాయాలను, సముద్రం మధ్యలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. తమ దేశం రేడియోయాక్టివ్ సునామీని సృష్టిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిక సందేశం పంపించాడు. ఒకవేళ అదే నిజమైతే రష్యా తర్వాత అత్యధిక అణు సామర్థ్యమున్న రెండో దేశంగా ఉత్తర కొరియా మారుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తే అవకాశం ఉంటుంది.
అమెరికాపై అణుదాడి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉత్తర కొరియా ప్రయత్నిస్తుందనేది ఆ దేశం చేసే కసరత్తులు చూస్తే తెలుస్తోంది.మంగళవారం నుంచి గురువారం వరకు జరిగిన పరీక్షల్లో మాక్ న్యూక్లియర్ వార్‌హెడ్‌లతో అతికించిన క్రూయిజ్ క్షిపణులు కూడా ఉన్నాయని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం తెలిపింది. సముద్రం నీటి అడుగున డ్రోన్ పేలుడుకు ముందు దాని తూర్పు తీరంలో దాదాపు 60 గంటల పాటు ప్రయాణించిందని నార్త్ కొరియా పేర్కొంది.దక్షిణ కొరియాతో సంయుక్తంగా సైనిక విన్యాసాలకు పాల్పడితే తాము పసిఫిక్ మహా సముద్రాన్ని ఫైరింగ్ రేంజ్ గా మారుస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. అయితే ఆ డ్రోన్ కు అంత సామర్థ్యం లేదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..