కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన పరిశోధకులకు నోబెల్ బహుమతి..

2020లో వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ మహమ్మారి కోట్లాది మందికి సోకి లక్షలాది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే కరోనా ఉద్ధృతంగా ఉన్న పరిస్థితుల్లో అప్పటికే శాస్త్రవేత్తలు ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్స్ తయారుచేసే ప్రయోగాలను మొదలుపెట్టారు.

కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన పరిశోధకులకు నోబెల్ బహుమతి..
Katalin Kariko, Drew Weissman
Follow us

|

Updated on: Oct 02, 2023 | 8:00 PM

2020లో వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ మహమ్మారి కోట్లాది మందికి సోకి లక్షలాది ప్రాణాలను బలి తీసుకుంది. అయితే కరోనా ఉద్ధృతంగా ఉన్న పరిస్థితుల్లో అప్పటికే శాస్త్రవేత్తలు ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్స్ తయారుచేసే ప్రయోగాలను మొదలుపెట్టారు. భారత్, అమెరికా, యూకే, చైనా ఇలా పలు దేశాలు కరోనా వ్యాక్సిన్లను తయారు చేసి చాలావరకు కరోనా మరణాలను ఆపడంలో విజయం సాధించాయి. మనిషి రోగ నిరోధక శక్తిని పెంచే ఈ వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల చాలా మంది కరోనా మహమ్మారి తీవ్రతకు గురి కాకుండా కొద్ది రోజుల్లోనే కోలుకున్న సంఘటనలు ఎన్నో జరిగాయి. అయితే ప్రపంచంలో ఏదైన రంగంలో విశేష కృషి చేసినవారికి ప్రకటించే అత్యున్నత పురస్కారం నొబెల్ బహుమతి. అయితే 2023 సంవత్సరానికి వైద్య శాస్త్రంలో డాక్టర్ కాటలిన్‌ కరికో, డా.డ్రూ వీస్‌మన్‌లకు నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యురీ. కరోనా మహమ్మారిని అరికట్టే క్రమంలో వ్యాక్సిన్ల తయారీలో మెసెంజర్ ఆర్ఎన్ఏను అభివృద్ధి చేయడానికి కృషి చేసినందుకు వీరికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది.

హంగేరీకి చెందిన డా.కాటలిన్‌ కారికో అలాగే అమెరికాకు చెందిన డా.డ్రూ వీస్‌మన్‌లు చేసిన కృషికి 2021లోనే లష్కర్ అవార్డు లభించాయి. అయితే రెండేళ్ల తర్వాత వారికి నోబెల్ బహుమతులు దక్కాయి. ప్రపంచాన్ని అతలాకుతం చేసినటువంటి కరోనాను కట్టడి చేసే విషయంలో వీరిద్దరూ కూడా విశేషంగా శ్రమించారు. కరోనాను అరికట్టేందుక వీళ్లు పరిశోధించిన ఎమ్ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని న్యూక్లియో సైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను వీళ్లద్దిరికీ ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రకటించింది స్వీడెన్ స్టాక్‌హోంలోని నోబెల్ కమిటీ.

ఇవి కూడా చదవండి

అయితే ఎప్పటిలాగే నోబెల్ అవార్డు గ్రహీతల పేర్లను వారం రోజులు పాటు ప్రకటించనుంది జ్యురీ. అయితే ఇందులో భాగంగానే మొదటగా వైద్య శాస్త్రానికి సంబంధించిన కమిటీ, మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య విభాగం అలాగే శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. ఇక అక్టోబర్ 9వ తేదీన ఆర్ధిక రంగంలో నోబెల్ అవార్డు గ్రహీతల వివరాలను ప్రకటించనుంది జ్యూరీ. అయితే ఈసారి నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్న గ్రహీతలకు భారత కరెన్సీ ప్రకారం 7.58 కోట్ల రూపాయలుగా ఉన్న పారితోషికాన్ని 8.35 కోట్ల రూపాయలకు పెంచుతూ బహుకరించనున్నారు.