UK high court – Nirav Modi: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14వేల కోట్లు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. భారత్‌కు అప్పగించకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నీరవ్ మోదీపై ఉన్న ఆరోపణలు రుజువయ్యాయని.. ఆయన్ను భారత్‌కు అప్పగించాలని ఫిబ్రవరి 14న బ్రిటన్ కోర్టు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. బ్రిటన్ కోర్టులో తనను భారత్‌కు అప్పగించవద్దంటూ నీరవ్ మోదీ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం యూకే హోంశాఖ సెక్రటరీ కూడా.. ఏప్రిల్ 15న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు సంతకం చేశారు. దీంతో తాజాగా నీరవ్ మోదీ యూకే హైకోర్టును ఆశ్రయించారు. తన మానసిక స్థితి సరిగా లేదని, ఈ పరిస్థితుల్లో తనను భారత్‌కు అప్పగిస్తే న్యాయం జరగదని, అందువల్ల తనను అప్పగించవద్దని హైకోర్టులో పిటిషన్ వేశారు.
నీరవ్‌మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ.14 వేల కోట్ల మేర మోసం చేసిన అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్‌కు పారిపోయారు. 2018 జనవరిలో సీబీఐ నీరవ్ మోదీ, చోస్కి సహా 25 మందిపై కేసు నమోదు చేసింది. సీబీఐ ఫిర్యాదు అనంతరం నీరవ్ మోదీని 2019లో బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును విచారణ జరుపుతున్న సీబీఐ అప్పటి నుంచి నీరవ్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు ఆదేశాల అనంతరం ఇటీవలే యూకే హోంశాఖ నీరవ్‌ను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తనను భారత్‌కు అప్పగించవద్దంటూ నీరవ్ మోదీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం నీరవ్ మోదీ బ్రిటన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నారు.
Also Read: