తీవ్ర విషాదం.. పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 60 మంది మృతి.. ఎక్కడంటే..

ట్యాంకర్‌ బోల్తా కొట్టడంతో ఇంధనం కోసం ఒక్కసారిగా జనాలు ఎగబ్డారు. అదే సమయంలో ట్యాంకర్‌ పేలి మంటలు చెలరేగడంతో దాదాపు 60 మంది వరకు ప్రజలు మరణించారని తెలిసింది. ఈ ఘటనపై అక్కడి ఎమర్జెన్సీ ఏజెన్సీ మీడియాకు సమాచారం అందించింది. ఈ ఘటనలో 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. 15కి పైగా దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర విషాదం.. పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 60 మంది మృతి.. ఎక్కడంటే..
Fuel Tanker Explosion

Updated on: Jan 19, 2025 | 2:06 PM

పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో పెను ప్రమాదం సంభవించింది. సెంట్రల్ నైజీరియాలో శనివారం ఇంధన ట్యాంకర్ పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే అది పేలిపోయింది. ట్యాంకర్‌ బోల్తా కొట్టడంతో ఇంధనం కోసం ఒక్కసారిగా జనాలు ఎగబ్డారు. అదే సమయంలో ట్యాంకర్‌ పేలి మంటలు చెలరేగడంతో దాదాపు 60 మంది వరకు ప్రజలు మరణించారని తెలిసింది.

ఈ ఘటనపై నైజీరియా ఎమర్జెన్సీ ఏజెన్సీ మీడియాకు సమాచారం అందించింది. ఈ ఘటనలో 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. 15కి పైగా దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఆఫ్రికాలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశమైన నైజీరియాలో ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారడం గమనార్హం. దీని కారణంగా దేశంలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. గత ఏడాది అక్టోబర్‌లో దేశంలోని జిగావాలో ఇలాంటి ట్యాంకర్ పేలి 147 మంది మరణించారు. ఈ ఘటన నైజీరియాలో జరిగిన అత్యంత దారుణమైన విషాదంలో ఒకటి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..