Dubai Hindu Temple: దుబాయ్‌లో హిందూ దేవాలయం ప్రారంభం.. ఇక్కడి విశిష్టత.. ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిందే..

ఈ ఆలయం దసరా సందర్భంగా అక్టోబర్ 5 న అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అన్ని మతాల వారికి దసరా సందర్భంగా దర్శనాలకు అనుమతించారు. అయితే,

Dubai Hindu Temple: దుబాయ్‌లో హిందూ దేవాలయం ప్రారంభం.. ఇక్కడి విశిష్టత.. ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిందే..
Dubai Hindu Temple

Updated on: Oct 06, 2022 | 9:35 AM

దుబాయ్ లో హిందూ దేవాలయం: దుబాయ్‌లో వెలసిన హిందూ దేవాలయం భక్తులను ఆకట్టుకుంటోంది. దుబాయ్‌లోని జెబెల్ అలీలో నిర్మించిన నూత‌న‌ హిందూ దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుంది. పురాతన హిందూ దేవాలయాలలో ఒకటైన సింధీ గురు దర్బార్ ఆలయానికి పొడిగింపు. ఈ ఆలయం దసరా సందర్భంగా అక్టోబర్ 5 న అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అన్ని మతాల వారికి దసరా సందర్భంగా దర్శనాలకు అనుమతించారు. అయితే, అన్ని మతాల ప్రజలకు స్వాగతం పలుకుతూ ఈ ఆలయాన్ని సెప్టెంబర్ 1, 2022న ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. యుఎఇలో ఒకే కమ్యూనిటీకి చెందిన మొట్ట మొదటి ఆలయం ఇది.

ఇకపోతే, ఇక్కడ ఆలయం విశిష్టిత, విశేషాలను భారత రాయబారి సంజయ్‌ సుధ్రి వెల్లడించారు. ఇక్కడ వెలసిన ఆలయంలో వినాయకుడు, శ్రీ కృష్ణుడు, మహాలక్ష్మి, గురువాయురప్న్, అయ్యప్ప, శివుడు సహా మొత్తం 16 హిందూ దేవతలతో పాటు గురు గ్రంథ్ సాహిబ్‌ను ప్ర‌తిష్టించారు. ఇక ఈ ఆలయంలో నిత్యం పూజాది కార్యక్రమాల కోసం ప్రత్యేకించి ఎనిమిది మంది పూజారులను నియమించినట్టు . భారత రాయబారి సంజయ్ సుధ్రి తెలిపారు.

దుబాయ్‌లో పూజా విలేజ్’గా ప్రసిద్ధి చెందిన జబెల్ అలీలో ఉంది ఈ ప్రత్యేక దేవాలయం. అనేక చర్చిలు, గురునానక్ దర్బార్ గురుద్వారాలు ఈ ప్రదేశంలో అనేకం ఉన్నాయి. ఇక ఈ ఆలయం 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో,రెండు అంతస్తుల్లో నిర్మించారు. మొదటి అంతస్తులో పెద్ద ప్రార్థనా మందిరం. దానికి ఒక వైపున చిన్న గదులు నిర్మించబడి అందులో 16 మంది దేవుళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్రహ్మదేవుడికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు.

మొదటి అంతస్తులో 4,000 చదరపు అడుగుల హాలు ఒకటి ఉంటుంది. ఈ హాలులోనే మతపరమైన,సామాజిక కార్యక్రమాలు నిర్వహంచుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివాహాలు, ప్రైవేటు ఈవెంట్లు చేయడానికి తగిన సౌకర్యాలను కల్పించారు. ఇదిలా ఉంటే, ఆల‌యంలోని ప్రధాన‌ హాలులో ఏర్పాటు చేసిన పెద్ద 3D ప్రింటెడ్ గులాబీ కమలం చాలా ఆకర్ష‌ణీయంగా ఉంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..