Myanmar: పండగ వేడుకలతోనే నిరసనన తెలుపుతున్న ప్రజలు..ఎందుకో తెలుసా?

మయన్మార్ లో వింత నిరసన చేస్తున్నారు అక్కడి ప్రజలు. తమ దేశంలో సైనికులు చేస్తున్న దమనకాండను ఎదుర్కోలేకపోతున్న అక్కడి ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను బహిష్కరించారు.

  • KVD Varma
  • Publish Date - 5:55 pm, Fri, 16 April 21
Myanmar: పండగ వేడుకలతోనే నిరసనన తెలుపుతున్న ప్రజలు..ఎందుకో తెలుసా?
Mayanmar Protests

Myanmar: మయన్మార్ లో వింత నిరసన చేస్తున్నారు అక్కడి ప్రజలు. తమ దేశంలో సైనికులు చేస్తున్న దమనకాండను ఎదుర్కోలేకపోతున్న అక్కడి ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను బహిష్కరించారు, అదే సమయంలో ఈ వేడుకల సందర్భాన్ని సైనికులపై తమ నిరసన వ్యక్తం చేయడానికి వేదికగా మార్చుకుంటున్నారు. మయన్మార్ లో ఆ దేశ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర వేడుకలు ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అయితే, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సైనిక హత్యలకు నిరసనగా ఐదు రోజుల పాటు జరిగే నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు బౌద్ధ విగ్రహాలను శుభ్రం చేసుకుని..ప్రార్థనలు చేస్తారు. అయితే, దేశంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఆ వేడుకలను రద్దు చేసుకున్నారు. కానీ, దేశంలో అత్యంత ప్రాథాన్యత కలిగిన పండుగ దినం కావడంతో ఆరోజు సంప్రదాయ పద్ధతిలో పండుగ జరుపుకుంటూనే తమ నిర్సననూ తెలియచెప్పారు. అక్కడి మహిళలు పూలతో చక్కగా అలంకరించిన కుండలను పట్టుకుని… కొత్త వస్త్రాలు ధరించి తమ కొత్తసంవత్సరపు పండుగ తొలిరోజు జరుపుకున్నారు. అయితే, మూడు వెళ్ళు చూపించే విధంగా పెయింట్‌ను కుండలపై వేసి… వాటిని పట్టుకుని పీపుల్స్‌ పవర్‌, అవర్‌ పవర్‌ అంటూ మహిళలు నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

అదేవిధంగా పండుగ రెండో రోజు కూడా నిరసనగా.. ఉద్యమకారులు ప్రభుత్వ కార్యాలయాల వెలుపల, రహదారులపై రక్తపు మరకలను పెయింట్‌ వేశారు. సైనిక హత్యలకు వ్యతిరేకంగా… మిలటరీని అవమానించే లక్ష్యంతోనే… వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఇలా రెడ్‌ పెయింట్‌ వేశారు. ఆకులమీద నినాదాలు రాసి తోరణాలుగా కట్టారు. రాత్రి పూట పలు ప్రాంతాలలో హాట్ ఎయిర్ బెలూన్లు, కొవ్వొత్తులు వెలిగించి నిరసనలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా కొన్ని చోట్ల నిరసనలలో హింస జరిగినట్టు తెలుస్తోంది. కానీ, దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. అక్కడ జంటా సైన్యం మీడియాను అడ్డుకుంటోంది. దీంతో నిరసనలకు సంబంధించిన చాలా విషయాలను సేకరించడానికి అవకాశం దొరకడం లేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి.

మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, సైనికులు పెత్తనం సాగిస్తున్నారు. ఫిబ్రవరి 1న మొదలైన సైనిక తిరుగుబాటు ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యతిరేకిస్తున్న నిరసనకారులపై జుంటా సైన్యం తుపాకుల మోత మోగిస్తోంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యలు సిరియాలో మాదిరిగా పౌర సంఘర్షణలకు దారి తీయవచ్చునని, నర వధను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం విజ్ఞప్తి చేసింది. సూకీ ప్రభుత్వాన్ని కూల్చినప్పటి నుండి ఇప్పటి వరకు సైనిక బలగాల చేతుల్లో 710 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.

Also Read: Citi Bank India Exit: సిటీ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. భారతదేశంలో వినియోగదారుల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన.. కారణం అదేనా..?

Indiana: ఇండియానాలో కాల్పుల కలకలం.. ఆగంతకుని కాల్పుల్లో 8 మంది మృతి!