1900 తర్వాత అమెరికాలో కొత్త చరిత్ర

1900 సంవత్సరం తర్వాత 2020 ఎన్నికల్లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. బైడెన్ 73 మిలియన్లకు పైగా ఓట్లు గెలుచుకున్నారు. ఇది ఒక అమెరికా అధ్యక్ష అభ్యర్థి సాధించిన అత్యధిక ఓట్లు. ట్రంప్‌కు దాదాపు 70 మిలియన్ ఓట్లు వచ్చాయి. చరిత్రలో ఇది రెండో అత్యధిక ఓట్లు. బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు. అమెరికా చరిత్రలోనే 78 […]

1900 తర్వాత అమెరికాలో కొత్త చరిత్ర
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 08, 2020 | 7:25 AM

1900 సంవత్సరం తర్వాత 2020 ఎన్నికల్లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. బైడెన్ 73 మిలియన్లకు పైగా ఓట్లు గెలుచుకున్నారు. ఇది ఒక అమెరికా అధ్యక్ష అభ్యర్థి సాధించిన అత్యధిక ఓట్లు. ట్రంప్‌కు దాదాపు 70 మిలియన్ ఓట్లు వచ్చాయి. చరిత్రలో ఇది రెండో అత్యధిక ఓట్లు. బరాక్ ఒబామా దగ్గర 8 ఏళ్లు ఉపాధ్యక్షుడుగా పనిచేసిన వైట్ హౌస్‌లో బైడెన్ ఇప్పుడు అధ్యక్ష పీఠం అధిష్టించడానికి సిద్ధమయ్యారు. అమెరికా చరిత్రలోనే 78 ఏళ్ల వయసులో అధ్యక్షుడైన నేతగా బైడెన్‌ కొత్త రికార్డు సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డ్ 74 ఏళ్ల డోనల్డ్ ట్రంప్ పేరునే ఉంది. జార్జియా, నెవడాలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరింతంగా సాగింది. ఇరువురు మధ్య ఆధిక్యం దోబూచులాడగా… పెన్సిల్వేనియా రాష్ట్రం ఫలితంతో విజేత ఎవరో తేలిపోయింది. అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌‌కు ఇప్పటికే భద్రతను పెంచారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థ అధికారులను పంపించింది. విల్లింగ్టన్ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జో బైడెన్‌ కీలక ప్రసంగం చేయనున్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన అమెరికా ప్రజలకు బైడెన్‌ ధన్యవాదాలు చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.