Covid-19: వాసన పరీక్షతో కరోనా గుర్తింపు.. సరికొత్త కిట్‌ను అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు.. ఎలాగంటే..!

|

Apr 30, 2021 | 10:30 PM

Covid-19: కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అయితే కరోనా సోకిన కొందరిలోనే వ్యాధి లక్షణాలు బయట పడుతుండగా, కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ నిర్ధారణ అవుతుంది...

Covid-19: వాసన పరీక్షతో కరోనా గుర్తింపు.. సరికొత్త కిట్‌ను అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు.. ఎలాగంటే..!
Follow us on

Covid-19: కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అయితే కరోనా సోకిన కొందరిలోనే వ్యాధి లక్షణాలు బయట పడుతుండగా, కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ నిర్ధారణ అవుతుంది. మరి కొందరిలో లక్షణాలు పెద్దగా కనిపించకపోయినా వాసన కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాసన కోల్పోయే లక్షణమున్న కోవిడ్‌ 19తోపాటు ఇతర వ్యాధులను గుర్తించడానికి బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఓ కిట్‌ను రూపొందించారు. దీని ద్వారా పార్కిన్‌సన్‌ వంటి వ్యాధులతో పాటు భారీ సంఖ్యలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను తక్కువ ఖర్చుతోనే చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న స్క్రాచ్‌ స్నిఫ్‌ విధానంలో పరీక్షించే సాధానాలతో పోలిస్తే ఈ మాత్ర ఆధారిత వాసన పరీక్ష ఎంతో తేలికని పరిశోధకులు చెబుతున్నారు.

వాసన కోల్పోయే లక్షణం :

అయితే కరోనాతో పాటు పార్కిన్‌సన్‌, అల్జీమర్స్‌ వంటి కొన్ని రకాల నాడీకణ సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో వాసన కోల్పోయే లక్షణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు బ్రిటన్‌లోని క్వీన్స్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు ఓ పరిశోధన చేపట్టారు. ఓ రకమైన నూనె నుంచి తయారు చేసిన క్యాప్సూల్స్‌, ఓ పలకపై రెండు స్ట్రిప్స్‌ ఉండే ఓ కిట్‌ను తయారు చేశారు. అయితే వాసన కోల్పోతున్న వ్యక్తి ఆ మాత్రలను చేతితో చూర్ణం చేసి స్ట్రిప్‌పై వేసి వాసన చూడాలి. దానిని పీల్చి వాసనను గుర్తించే సామర్థ్యాన్ని బట్టి స్కోర్‌ నమోదు చేస్తారు. ఈ మాత్రల ఆధారంగా జరిపే ఈ పరీక్ష ద్వారా వాసన కోల్పోయే లక్షణమున్న అన్ని రకాల వ్యాధులను గుర్తించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

చిన్నారులకు..

అలాగే చిన్నారులకు స్వాబ్‌ నమూనాను తీసుకునే సమయంలో వారు తీవ్ర భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి సమయంలో కేవలం వారి ఇంటిలోనే ఈ పరీక్ష సహాయంతో తేలికగా వైరస్‌ నిర్ధారణ చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా పరీక్షించడం ఎంతో తేలిక అని తాజా అధ్యయనంలో తేలిందని పరిశోధకులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Covid-19: కరోనాతో అతలాకుతలం.. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలను బలి తీసుకున్న కోవిడ్‌

Reliance Foundation: పెద్ద మనసును చాటుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. వెయ్యి పడకలతో కోవిడ్‌ ఆస్పత్రి.. ఎక్కడంటే