New Cancer vaccine: క్యాన్సర్‌కు వ్యాక్సిన్ తయాచేసిన రష్యా.. మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందంటే?
క్యాన్సర్ పేషంట్స్‌కి రష్యా శుభవార్త చెప్పింది. క్యాన్పర్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యానే ప్రకటించింది. mRNA క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసింది. అంతేకాకుండా ఆ వ్యాక్సిన్‌ను వాళ్ల దేశ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది
క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి.. క్యాన్సర్ పేరు వినగానే అందరిలో ఎంతో తెలియని భయం వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం క్యాన్సర్ అంటే ఖరీదైన చికిత్స.. సరైన మందు లేకపోవడం అందర్నీ కలచి వేసే విషయం. కానీ ఇక ప్రజలు ఆందోళన పడవలసిన అవసరం లేదు. క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడేందుకు రష్యా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది. అంతే కాకుండా రష్యా ఆ దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనునంది. ఈ వ్యాక్సిన్‌ను క్యాన్సర్‌ను నిరోధించేందుకు కాకుండా క్యాన్సర్ రోగుల చికిత్సకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు.
రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్లు రష్యా వార్తా సంస్థ టాస్ పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను 2025 ప్రారంభంలో విడుదల చేస్తారని తెలిపింది. 2025 ప్రారంభంలో ఈ వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఆండ్రీ కప్రిన్, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రష్యా తన స్వంత mRNA వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను రోగులకు ఉచితంగా అందజేయనున్నారు. క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ ట్రయల్స్ క్యాన్సర్ పెరుగుదల, వ్యాప్తిని నిరోధిస్తుందని Alexander Gintsburg, Gamanta నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్ వారు వెల్లడించారు.
అయితే, ఈ వ్యాక్సిన్ ఏ రకమైన క్యాన్సర్‌కు చికిత్స చేస్తుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇది క్యాన్సర్ రోగుల ప్రాణాలను ఎలా కాపాడుతుంది? ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ పేరు కూడా ఇంకా వెల్లడించలేదు. ఇతర దేశాలు కూడా ఇలాంటి ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. క్యాన్సర్ చికిత్స కోసం బ్రిటిష్ ప్రభుత్వం జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీకి రష్యా చాలా దగ్గరగా ఉందని చెప్పారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ట్రయల్ వర్క్ చివరి దశలో ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి