ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేరియంట్లను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ…, ఇండియా ‘డెల్టా’ స్ట్రెయిన్ ప్రమాదకరమని నిర్ధారణ

| Edited By: Phani CH

Jun 02, 2021 | 10:49 AM

ప్రపంచ దేశాల్లో నాలుగు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. మొదట బ్రిటన్ లో కనుగొన్నదానిని ఆల్ఫాగాను, సౌతాఫ్రికాలోని వేరియంట్ ను బేటాగాను, బ్రెజిల్ లో గుర్తించిన దాన్ని గామా గాను పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేరియంట్లను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..., ఇండియా డెల్టా స్ట్రెయిన్ ప్రమాదకరమని నిర్ధారణ
4 Variants Identified By Who
Follow us on

ప్రపంచ దేశాల్లో నాలుగు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. మొదట బ్రిటన్ లో కనుగొన్నదానిని ఆల్ఫాగాను, సౌతాఫ్రికాలోని వేరియంట్ ను బేటాగాను, బ్రెజిల్ లో గుర్తించిన దాన్ని గామా గాను పేర్కొంది. ఇండియాలో మే 11 న ఐడెంటిఫై చేసిన స్ట్రెయిన్ ని డెల్టాగా ప్రకటించింది. కోవిద్-19 తొలి కేసును చైనాలోని వూహాన్ సిటీలో 2019 మొదట్లోనే గుర్తించినట్టు ఈ సంస్థ వెల్లడించింది. అప్పటి నుంచి ఈ డెడ్లీ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని వివరించింది. అయితే చైనా ఈ వాదనను ఖండిస్తూ వస్తోంది. తమ దేశంలో కనుగొన్నది న్యుమోనియా అని, ఈ డెడ్లీ వైరస్ కాదని అడ్డంగా దబాయిస్తోంది. ఏమైనా ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 3,548,628 మంది రోగులు మృతి చెందారు. మొత్తం 170,426,245 మందికి ఇది సోకింది. కాగా ఇండియాలో కనుగొన్న స్ట్రెయిన్ ప్రమాదకరమని, ఇది ఆందోళన కలిగిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. మరో రెండు వేరియంట్లు అంత ప్రమాదకరం కాదని, ఇండియాలో డెల్టా వేరియంట్ మూడు భాగాలుగా చీలిపోయిందని విశ్లేషించింది. దీన్ని ట్రిపుల్ మ్యుటెంట్ వేరియంట్ గా వ్యవహరిస్తున్నారు.

బీ-1.617.1 స్ట్రెయిన్ ని ‘కప్పా’ గా బీ.1.617.2 ని డెల్టాగా ఈ సంస్థ వివరించింది. వీటిని ముఖ్యంగా అదుపు చేయవల్సిన అవసరం ఉందని సూచించింది.అటు- ఇండియాలో గత 24 గంటల్లో 1,27,510 కోవిద్ కేసులు నమోదయ్యాయి. 54 రోజుల తరువాత ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.62 శాతం ఉన్నట్టు ఈ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో కేసులు ఇంకా తగ్గగలవని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది..

 

మరిన్ని ఇక్కడ చూడండి: India Corona Cases:దేశంలో కొత్త‌గా 1,32,788 క‌రోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా

Girl Fights off Wild Bare: పెంపుడు కుక్కల కోసం ప్రాణాలకు తెగించి ఎలుగుబంటితో పోరాడిన యువతి.. వీడియో వైరల్..