Plane Accidents: 30 ఏళ్లలో 27 విమానాలు ప్రమాదాలు.. కారణాలు ఏమిటి? బట్టబయలవుతున్న షాకింగ్‌ విషయాలు

|

Jan 15, 2023 | 5:34 PM

విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సాంకేతి కారణాల వల్లనో, లేక రన్‌వేలపై ల్యాండింగ్‌, ఇతర కారణాల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే..

Plane Accidents: 30 ఏళ్లలో 27 విమానాలు ప్రమాదాలు.. కారణాలు ఏమిటి? బట్టబయలవుతున్న షాకింగ్‌ విషయాలు
Plane Accidents
Follow us on

విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సాంకేతి కారణాల వల్లనో, లేక రన్‌వేలపై ల్యాండింగ్‌, ఇతర కారణాల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. ఇక తాజాగా ఆదివారం నేపాల్‌లోని పోఖారాలో ప్రయాణీకుల విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఇందులో  68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మందితో వెళ్తున్న విమానం పోఖారా విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో  మొత్తం 72 మంది సజీవదహనమైనట్లు నేపాల్ ప్రభుత్వం నిర్ధారించింది. నేపాల్ సైన్యం మరియు పోలీసులు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌లో కొనసాగుతోంది. ప్రమాద ఘటనపై మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేపాల్‌లో ఇది మొదటి ఘటన కాదు. గత కొన్నేళ్లుగా ఇక్కడ అనేక విమాన ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ నేపాల్‌లో విమాన ప్రయాణం కూడా ప్రమాదకరమని అభివర్ణించారు.

గత 30 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే.. ఏవియేషన్ సేఫ్టీ డేటాబేస్ నివేదిక ప్రకారం.. గత 30 ఏళ్లలో నేపాల్‌లో 27 విమాన ప్రమాదాలు జరిగాయి. ఇందులో గత దశాబ్ద కాలంలో 20 ఘటనలు జరిగాయి. అటువంటి పరిస్థితిలో నేపాల్‌లో విమాన ప్రయాణం ఎందుకు చాలా ప్రమాదకరం, దీనికి కారణాలు ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది.

అందుకే నేపాల్‌లో విమాన ప్రయాణం ప్రమాదకరం

నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అత్యంత ముఖ్యమైనది కఠినమైన పర్వత భూభాగం. ఇది విమానానికి ప్రమాదాన్ని పెంచడానికి కారణం. నేపాల్‌లోని ఎయిర్‌స్ట్రిప్‌లు పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ వాతావరణం అకస్మాత్తుగా మారుతుంది. ఇది విమానం ప్రమాదాన్ని పెంచుతుంది. కొత్త విమానాల కోసం మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఆ రంగాన్ని మెరుగుపరచడానికి పెట్టుబడి పెట్టడం కూడా ఒక ముఖ్యమైన కారణం. నేపాల్‌లో తగిన శిక్షణ పొందిన విమానయాన సిబ్బంది కొరత కూడా ఉంది. ఇది కాకుండా, విమానయాన సంస్థను నడపడానికి అవసరమైన సిబ్బంది సంఖ్య కూడా తక్కువే. ఇలాంటి కారణాలు నేరుగా విమానయాన రంగంపై ప్రభావం చూపుతోంది.

ఇవి కూడా చదవండి

2013లో భద్రతాపరమైన సమస్యలను పేర్కొంటూ యూరోపియన్ యూనియన్ అన్ని నేపాల్ విమానయాన సంస్థలను తన గగనతలంపై ప్రయాణించకుండా నిషేధించింది. ఇక్కడ విమానయాన రికార్డు దృష్ట్యా, యూరోపియన్ కమిషన్ నేపాలీ ఎయిర్‌లైన్స్‌ను 28 దేశాలకు వెళ్లకుండా నిషేధించింది. గత సంవత్సరం మార్చి నెలలో స్థానిక వార్తాపత్రిక ఖాట్మండు పోస్ట్ నివేదించింది. నేపాల్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇక్కడి విమానాలు యూరోపియన్ యూనియన్ విమానయాన బ్లాక్‌లిస్ట్ నుండి బయటపడలేకపోతున్నాయి.

ఈ ప్రాంతంలోనే ఎక్కువ ప్రమాదాలు:

మునుపటి రికార్డును పరిశీలిస్తే నేపాల్‌లో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం సముద్ర మట్టానికి 1,338 మీటర్ల ఎత్తులో ఉన్న ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఇరుకైన ఓవల్ ఆకారపు లోయలో ఉన్నందున ఈ ప్రాంతం ముఖ్యంగా ప్రమాదకరమైనది. దీనితో పాటు ఇది ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడి ఉంటుంది. విమాన ప్రయాణానికి కావాల్సినంత వెసులుబాటును ఈ భాగం ఇవ్వడం లేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. చాలా మంది పైలట్లు ఏటవాలు, ఇరుకైన రన్‌వే విమానాన్ని నావిగేట్ చేయడం కష్టతరం చేస్తుందని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి