NASA : నవ్వుతున్న సూర్యుడు..! ఫోటో షేర్‌ చేసిన నాసా.. ప్రమాదం పొంచి ఉందంటున్న శాస్త్రవేత్తలు..!!

|

Oct 31, 2022 | 6:50 AM

అతినీలలోహిత కాంతిలో చూసినప్పుడు సూర్యునిపై ఉన్న ఈ చీకటి మచ్చలను కరోనల్ హోల్స్ అంటారు. బలమైన సౌర గాలులు అంతరిక్షంలోకి వీచే ప్రాంతాలు ఇవి.

NASA : నవ్వుతున్న సూర్యుడు..! ఫోటో షేర్‌ చేసిన నాసా.. ప్రమాదం పొంచి ఉందంటున్న శాస్త్రవేత్తలు..!!
Smiling Sun
Follow us on

మన బాల్యంలో మనం సూర్యుడి బొమ్మను ఎలా గీసామో గుర్తుందా..? ఈజీగా ఓ వృత్తం గీసి అందులో నవ్వుతున్న నోటిపై రెండు కళ్లను కూడా గీసేవాళ్లం.. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రస్తుతం చిన్న పిల్లలు ఈసే స్మైలీ బొమ్మను పోలివుంటాడు సూర్యుడు. అయితే, ఇప్పుడు, మన చిన్ననాటి కళ నిజమైంది అనిపిస్తుంది. సూర్యుడు నిజంగానే నవ్వుతున్నాడు. నమ్మడం లేదుకదా..! కానీ, ఇది మేము చెప్పడం లేదు. నాసా ఉపగ్రహం ఈ వారం సూర్యుని చిత్రాన్ని క్యాప్షన్‌ చేసింది. ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. సూర్యుడు నవ్వుతున్నట్లుగా కనిపించే నమూనా చిత్రాని నాసా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నప్పుడు, US స్పేస్ ఏజెన్సీ దీనిని స్మైలింగ్ సన్ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. సూర్యుడు నవ్వుతున్న ముఖంతో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సూర్యుడిని ‘నవ్వుతూ’ చూసిందని నాసా ఒక ట్వీట్‌లో పేర్కొంది. అతినీలలోహిత కాంతిలో చూసినప్పుడు సూర్యునిపై ఉన్న ఈ చీకటి మచ్చలను కరోనల్ హోల్స్ అంటారు. బలమైన సౌర గాలులు అంతరిక్షంలోకి వీచే ప్రాంతాలు ఇవి.

ఇవి కూడా చదవండి

మరోవైపు, నాసా ఈ చిత్రాన్ని విడుదల చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వచ్చాయి.. చాలా మంది దీనిని దెయ్యం ముసుగు అని పిలుస్తుండగా మరికొందరు దీనిని సింహం ముసుగు అంటున్నారు.. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఈ చిత్రాన్ని పిల్లల ప్రదర్శన టెలిటబ్బీస్‌తో పోల్చారు.

ఈ ఫోటో అక్టోబర్ 26 నుండి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, ప్రజలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సూర్య బిస్కెట్ అని నిర్ధారణ అయింది అని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో రాశాడు. సూర్యుడి ఈ చిత్రంతో పాటు, ఆ వ్యక్తి మినీ బిస్కెట్ ఫోటో కూడా షేర్‌ చేశాడు. చాలా మంది ఫోటోను కాస్త మార్చారు. ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఈ నవ్వుతున్న సూర్యుడికి సింహం రూపాన్ని ఇచ్చాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి