NASA James Webb Space Telescope launch: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. నాసా సైంటిస్టులు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపారు. మిషన్ లా పనిచేసే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను గయానా స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. దీని ద్వారా ఈ విశ్వంలోని రహస్యాలను ఛేదించాలన్నది సైంటిస్టుల ప్రయత్నం.
ఓ రకంగా ఇది గత కాల ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్‌లాంటిది. అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్ ఇ.వెబ్ పేరునే దీనికి పెట్టారు. హబుల్ టెలిస్కోప్ వారసత్వాన్ని కొనసాగించటానికి రంగంలోకి దిగుతున్న దీనికి షార్ట్ ఫామ్‌లో ‘వెబ్’ అని పిలుచుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ అకాడమీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.
క్రిస్మస్ సందర్భంగా ఖగోళ శాస్త్రవేత్తలు, స్కైవాచర్లకు నాసా ప్రత్యేక కానుకను ఇచ్చింది. దీనిని డిసెంబర్ 25 ఉదయం 07:20 (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.50) లాంచ్ చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.
https://www.news9live.com/science/nasa-james-webb-space-telescope
Read Also.. Debit Card: మీరు డెబిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..