NASA: ముగింపుదశకు నాసా జాబిల్లి యాత్ర.. భూమిపైకి తిరుగు ప్రయాణం..

|

Dec 03, 2022 | 6:28 AM

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన లేటెస్ట్ ప్రాజెక్ట్.. ఆర్టెమిస్ 1 మిషన్ మూన్. దీనిలో భాగంగా చందమామపై ప్రయోగాలను చేయడానికి ఇటీవలే ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించారు నాసా శాస్త్రవేత్తలు. 4.1 బిలియన్ డాలర్ల వ్యయంతో..

NASA: ముగింపుదశకు నాసా జాబిల్లి యాత్ర.. భూమిపైకి తిరుగు ప్రయాణం..
Orion Spacecraft
Follow us on

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన లేటెస్ట్ ప్రాజెక్ట్.. ఆర్టెమిస్ 1 మిషన్ మూన్. దీనిలో భాగంగా చందమామపై ప్రయోగాలను చేయడానికి ఇటీవలే ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించారు నాసా శాస్త్రవేత్తలు. 4.1 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ మిషన్ మూన్‌ను విజయవంతం చేశారు. సెకెనుకు 160 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు దూసుకెళ్లింది ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను మోసుకెళ్లిన రాకెట్. అయితే నాసా జాబిల్లి యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఆర్టెమిస్‌-1లోని ఒరియన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ భూమిపైకి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. నాసా ప్రయోగించిన ఆర్టెమిస్‌-1లోని ఒరియన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ భూమిపైకి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. దీనిని ఆర్టెమిస్‌-1 ప్రాజెక్టులో భాగంగా నవంబర్‌ 16న ప్రయోగించారు. నవంబర్‌ 25వ తేదీన చంద్రుడి వైపు సుదూర ప్రాంతానికి ఇది చేరుకొంది. తాజాగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన ఒరియన్‌.. డిసెంబర్‌ 11వ తేదీన కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అవుతుంది. ఇది గంటకు దాదాపు 39,400 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. స్పేస్‌ స్టేషన్‌ నుంచి వ్యోమగాములు భూమిపైకి వచ్చే వేగం కన్నా ఇది చాలా అధికం. ఇది భూమి పైకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టే ముందు 10 చిన్న ఉపగ్రహాలను విడుదల చేయనుంది. ఇవి చంద్రుడి దక్షిణ ద్రువంపై మంచును గుర్తించడం వంటి పనులు చేయనున్నాయి. భవిష్యత్తులో జరిగే ఆర్టెమిస్‌ ప్రాజెక్టుల్లో మనుషులు అక్కడే ల్యాండ్‌ అవ్వనున్నారు.

చంద్రుడికి అత్యంత సమీపం నుంచి ఈ ఫొటోలను తీసింది ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్. ఈ నెల 21వ తేదీన చంద్రుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను నాసా విడుదల చేసింది. ఉపరితలం నుంచి 130 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ఈ ఫోటోలను ఒరియన్ క్లిక్‌మనిపించింది. ఒరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు అమర్చిన ఆన్‌బోర్డ్ ఆప్టికల్ నేవిగేషన్ కెమెరా ఈ ఫొటోలను తీసింది. కక్ష్యలోకి ప్రవేశించిన ఆరో రోజున స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడికి మరింత సమీపానికి చేరుకునేలా ఇంజిన్‌ను మండించారు నాసా శాస్త్రవేత్తలు.
ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైతే 2024లో ఆర్టెమిస్‌-2 యాత్రను నాసా నిర్వహిస్తుంది. అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. అయితే వారు చంద్రుడిపై దిగరు. జాబిల్లి ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే కానుంది.

2025లో ఆర్టెమిస్‌-3 ప్రయోగం జరుగుతుంది. ఆ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారు. ఇందుకోసం ఒరాయన్‌.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకపై ఆధారపడనున్నారు. ఒరాయన్‌ తొలుత చంద్రుడి కక్ష్యలోని స్టార్‌షిప్‌తో అనుసంధానమవుతుంది. అప్పుడు ఒరాయన్‌లోని వ్యోమగాములు ఆ వ్యోమనౌకలోకి ప్రవేశిస్తారు. భూ కక్ష్యలోని డిపో నుంచి స్టార్‌షిప్‌నకు ఇంధనం అందుతుంది. తర్వాతి దశలో గేట్‌వే పేరుతో చంద్రుడి కక్ష్యలో ఒక మజిలీ కేంద్రాన్ని నాసా ఏర్పాటు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..