Mystery of Plane Crash: ఎప్పుడో ఐదున్నర దశాబ్దాల క్రితం అదృశ్యమైన విమాన రహస్యం.. కరువు దెబ్బకు బయట పడింది!

|

Jun 18, 2021 | 5:20 PM

Mystery of Plane Crash: ఎప్పుడో 56 ఏళ్ళక్రితం తప్పిపోయిన విమానం.. అదేదో మిస్టరీ అని అందరూ భావించిన ఘటన.. ఇప్పుడు ఆచూకీ దొరికింది.

Mystery of Plane Crash: ఎప్పుడో ఐదున్నర దశాబ్దాల క్రితం అదృశ్యమైన విమాన రహస్యం.. కరువు దెబ్బకు బయట పడింది!
Mystery Of Plan Crash
Follow us on

Mystery of Plane Crash: ఎప్పుడో 56 ఏళ్ళక్రితం తప్పిపోయిన విమానం.. అదేదో మిస్టరీ అని అందరూ భావించిన ఘటన.. ఇప్పుడు ఆచూకీ దొరికింది. అక్కడ వచ్చిన కరువు.. కనిపించకుండా పోయిన విమాన రహస్యాన్ని ఛేదించింది. దీంతో ఎన్నాళ్ళో వెతికిన విమానం గురించిన మరిన్ని విషయాల కోసం నిపుణులు అన్వేషిస్తున్నారు. అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియా ప్రస్తుతం తీవ్ర కరువును ఎదుర్కొంటోంది. ఇక్కడ కరువు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. చెరువులు.. సరస్సులు.. నదులు చాలా వరకూ ఎండిపోయాయి. ఇదే క్రమంలో ఇక్కడ ప్రసిద్ధ ఫోల్సమ్ సరస్సు కూడా చాలా వరకూ ఎండిపోయింది. దీంతో సరస్సు అంతర్భాగం చాలావరకూ బయటపడింది. దానితో పాటుగా 56 ఏళ్ల క్రితం తప్పిపోయిన విమానం శిధిలాలు సరస్సు మధ్యలో కనిపించి నిపుణులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నిపుణులకు కొత్త ఆశ వచ్చింది. కాలిఫోర్నియాలో తీవ్రమైన కరువు ఈ రహస్యాన్ని పరిష్కరించదానికి దారి చూపించింది. గత వారం అండర్వాటర్ సర్వే కంపెనీ ఈ ఎండిపోయిన సరస్సు వద్ద ఇక్కడ తన పరికరాలను పరీక్షిస్తోంది. ఈ సమయంలో వారు అనుకోకుండా విమానం శిధిలాలను కనుగొన్నారు.

గార్డియన్ వార్తల ప్రకారం, ఇక్కడ ఆ కంపెనీ ఉద్యోగులు కనుగొన్న అనుమానాస్పద వస్తువులను పరీక్షించగా ఇవి విమానంలో భాగాలని తేలింది. ఇవి సరస్సు లోతైన భాగంలో ఉన్నాయి. కంపెనీ సీఈఓ జోష్ టాంప్లిన్ క్రోన్ -4 టీవీతో మాట్లాడుతూ, ”మాకు ఇక్కడ ఒక విమానానికి సంబంధించిన ఫ్యూజ్‌లేజ్‌, కుడి రెక్క కనిపించాయి. అదేవిధంగా విమానం వెనుక భాగమూ దొరికింది. వీటిని నీటి అడుగుభాగంలో మునిగిపోయిన విమానంపై దర్యాప్తు చేస్తున్న సాంకేతిక నిపుణులకు అందచేశాం. వారు ఈ భాగాలు అప్పట్లో తప్పిపోయిన విమానం యొక్క భాగాలను పోలి ఉన్నాయని కనుగొన్నారు. కానీ దొరికిన చిత్రాలలో, విమానం సంఖ్య లేదా క్యాబిన్ లోపల ఉన్న సమాచారం తెలియలేదు.” అని చెప్పారు.

1965 లో కొత్త సంవత్సరంలో ప్రమాదం..

Mystery of Plane Crash: ఇది ఏ విమానం అని ఇంకా స్పష్టంగా తెలియలేదు. 1965 లో నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ఫోల్సమ్ ఆనకట్ట సమీపంలో కుప్పకూలిన పైపర్ కోమంచె 250 విమానం ఇది అని స్థానిక మీడియా భావిస్తోంది. ఈ విమానం గాలిలో కూలిపోయింది. చాలా సంవత్సరాల తరువాత, ఇప్పటివరకు పైలట్ మృతదేహం మాత్రమే కనుగొనగలిగారు. విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు, వీరి గురించి ఇంకా ఏమీ తెలియదు.

కరువు కారణంగా పెరిగిన ఆశ..

ఫోల్సమ్ సరస్సు యొక్క నీరు చారిత్రక స్థాయి కిందికి వెళ్లినందున ఈ దశాబ్దాల నాటి సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సియెర్రా నెవాడా నుండి ప్రవహించే ఈ సరస్సులో చాలా తక్కువ మంచు నీరు ఉంటుంది. దీనికి ముందే, ఇక్కడ విమానం జాడ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ విజయం సాధించలేదు.

2014 లో కూడా ప్రయత్నాలు

2014 లో కాలిఫోర్నియాలో కరువు ఉన్నప్పుడు, డైవింగ్ బృందాలు, సోనార్ బోట్ల ద్వారా ఫోల్సోమ్ సరస్సు దిగువకు చేరుకునే ప్రయత్నం జరిగింది. కానీ సరస్సు కింద చాలా మట్టి ఉంది, ఈ కారణంగా విమానం శిధిలాలను కనుగొనడంలో చాలా ఇబ్బంది ఉంది. ఆ సమయంలో క్రాష్ సమాచారం గురించి ఏ విషయమూ దొరకలేదు.

Also Read: Massive Spider Web: ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో రోడ్డు.. చెట్టు..పుట్ట అన్నీ సాలెపురుగుల గూటి కిందే ఎక్కడంటే..

Terrorism: ఉగ్రవాదుల వార్నింగ్ తో..ప్రజలకు పోలియో వ్యాక్సిన్ ఇవ్వలేని స్థితిలో పాకిస్తాన్!