పాకిస్తాన్‌లోని ప్రముఖ వాణిజ్య నగరం కరాచీని అంతుపట్టని విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ఈ జ్వరాల బారిన పడుతోన్న బాధితుల్లో ఉన్నట్లుండి ప్లేట్‌లెట్స్, తెల్లరక్త కణాల సంఖ్య తగ్గిపోతున్నాయి. దీంతో ఇది డెంగ్యూ జ్వరమని భావించిన వైద్యులకు పరీక్షలు చేస్తే మాత్రం నెగెటివ్ ఫలితాలు వస్తు్న్నాయి. దీంతో నగరంలో కరోనా తరహా కొత్త వైరస్ ఏదో వ్యాపిస్తోందని కరాచీ ప్రజలు తెగ ఆందోళన చెందుతున్నారు. పైగా నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, పాథాలజిస్టులతో సహా ఇతర నిపుణులు కూడా కరాచీలో డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. ‘బాధితుల్లో ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయి. తెల్లరక్త కణాలు క్షీణించిపోతున్నాయి. రోగులు అధిక జ్వరంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వీరికి డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలన్నీ ప్రతికూలంగా వస్తున్నాయి. ఇదేదో కొత్త జ్వరం లాగా ఉంది. పూర్తి ఫలితాలు రావడానికి మరికొంచెం సమయం పడుతుంది’ అని డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాలిక్యులర్ పాథాలజీ హెడ్ ప్రొఫెసర్ సయీద్ ఖాన్ చెబుతున్నారు.
ప్లేట్‌లెట్స్ కోసం బ్లడ్ బ్యాంకులకు పరుగులు..
కరాచీలోనే కాదు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా 45 కొత్త వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం సీజన్‌లో ఫెడరల్ క్యాపిటల్‌లో దాదాపుగా 4 వేలకు పైగా ఈ కొత్తరకం డెంగ్యూ వైరల్ కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా రిపోర్ట్ వెల్లడించింది. మరోవైపు ప్లేట్‌లెట్స్ అనూహ్యంగా పడిపోతుండడంతో బాధితులు బ్లడ్ బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు.
Also read:
Coronavirus: జంతువులనూ వెంటాడుతున్న కరోనా.. జూలోని పులులు, సింహాలకు పాజిటివ్..
Inspirational: విశ్రాంతి తీసుకునే వయసులో పీహెచ్‌డీ.. ఆదర్శంగా నిలుస్తోన్న అమెరికన్ వృద్ధుడు..