
Mumbai Attack Mastermind: 26/11 ముంబై ఉగ్రవాద దాడి కేసులు కీలక సూత్రధారి, లష్కర్ తొయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ-ఉర్-రెహమాన్ లఖ్వీని పాకిస్థాన్ శనివారం అరెస్టు చేసింది. టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై లఖ్వీని అరెస్టు చేసినట్లు పాక్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ముంబై దాడుల కేసుల్లో 2015 నుంచి లఖ్వీ బెయిల్‌పై ఉన్నాడు. అతనిని శనివారం కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే జకీ-ఉర్-రెహమాన్ లఖ్వీని ఎక్కడ అరెస్టు చేసింది పాక్ అధికారులు వెల్లడించలేదు.
2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 10 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులు పాల్గొన్నారు. ముంబై వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు 12 రోజులు దాడులు జరిపారు. ఈ ఉగ్రదాడుల్లో 9 మంది ఉగ్రవాదులతో సహా 174 మంది వరకు మృతి చెందారు. సుమారు 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో కసబ్ పట్టుబడ్డాడు. సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత చట్ట ప్రకారం మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదులంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా కసబ్ వెల్లడించారు. అయితే ఆనాడు జరిగిన మారణహోమ ఘటనను బాధిత కుటుంబాలు ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాయి.
Also Read:
Online Loan Apps: లోన్ యాప్ కేసుల్లో తవ్వేకొద్ది బయటపడుతున్న నిజాలు.. కీలక నిందితుడు నాగరాజే..!
Prisoners List: భారత్, పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న ఖైదీల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న ఇరు దేశాలు
PAK PM: చైనా నుంచి నేర్చుకోవాలి… వారి పురోగతి మాకెంతో ఆదర్శం.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్…