Russia Ukraine War: ఐక్యరాజ్యసమితిలో మాస్కో రాయబారి (Moscow Ambassador) కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ జాతీయవాదుల చేతిలో విదేశీయులు బందీలుగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఖార్కివ్‌లో భారతీయులు (Indians) 3,189 మంది ఉండగా, వియత్నామీస్-2700, ఖార్కివ్ (Kharkiv)లో బందీలుగా 202 మంది చైనీయులు, సుమీలో భారతీయులు 576 మంది, ఘనా-101, చైనీయులు 121, చెర్నిహివ్‌లో బందీలుగా 9 మంది ఇండోనేషియన్లు.
కొనసాగుతున్న ఆపరేషన్ గంగా
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వారి తరలింపులో భాగంగా ఆపరేషన్ గంగా కొనసాగుతోంది. 24 గంటల్లో మూడు సీ-17 విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయి. పోలాండ్, రొమేనియా, స్లోవేకియా నుంచి 629 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకోనున్నారు.
జెలెన్‌స్కీ భద్రత కోసం స్పెషల్ ఫోర్స్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. తన హత్యకు రష్యా కుట్ర చేస్తోందని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. నాలుగు సార్లు హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు గుప్పించారు. తను క్వీవ్‌లోనే ఉన్నట్లు ప్రకటించారు జెలెన్‌స్కీ. జెలెన్‌స్కీ ఇంటి ఆవరణలో రష్యా మిస్సైల్స్ శకలాలు గుర్తించడం కలకలం రేపుతోంది. జెలెన్‌స్కీ పోలాండ్ వెళ్లినట్లు రష్యా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జెలెన్‌స్కీ భద్రత కోసం స్పెషల్ ఫోర్స్ ఏర్పాటైంది.
ఇవి కూడా చదవండి: