Bomb Blast: వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. నిమిషాల గ్యాప్‌లో రెండు కార్లలో పేలిన బాంబులు

|

Oct 29, 2022 | 9:29 PM

రద్దీగా ఉండే జంక్షన్‌లో రెండుకార్లలో నిమిషాల గ్యాప్‌లో బాంబు పేలుళ్లు జరిగినట్లు చెప్పారు. పేలుడు ధాటికి వందల మీటర్ల ఎత్తులోకి దట్టమైన పొగలు విస్తరించాయి. కిలోమీటర్లమేర పరుచుకున్న పొగతో స్థానికులు ఊపిరిపీల్చుకునేందుకు..

Bomb Blast: వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. నిమిషాల గ్యాప్‌లో రెండు కార్లలో పేలిన బాంబులు
Somali Bomb Blast
Follow us on

సోమాలియా రాజధాని మొగదిషు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు వరుస పేలుళ్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. రెండు కార్లలో బాంబుల పేలుడు ధాటికి పదుల సంఖ్యలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రద్దీగా ఉండే జంక్షన్‌లో రెండుకార్లలో నిమిషాల గ్యాప్‌లో బాంబు పేలుళ్లు జరిగినట్లు చెప్పారు. పేలుడు ధాటికి వందల మీటర్ల ఎత్తులోకి దట్టమైన పొగలు విస్తరించాయి. కిలోమీటర్లమేర పరుచుకున్న పొగతో స్థానికులు ఊపిరిపీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. తొలుత ఓ ప్రభుత్వ కార్యాలయం దగ్గర జరిగిన పేలుడులో ఓ అంబులెన్స్‌ ధ్వంసం కాగా.. రద్దీగా ఉండే ఓ రెస్టారెంట్‌ సమీపంలో మరో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పేలుళ్లలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాద ప్రాంతంలో సహాయకచర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈ పేలుళ్లకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా.. బాధ్యత వహించలేదన్నారు.

రెండు కారు బాంబు పేలుళ్లు సోమాలియాలోని విద్యా మంత్రిత్వ శాఖ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో పేలుడు రెస్టారెంట్ బయట జరిగింది. చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, సంఘటనా స్థలం నుండి చాలా మంది మృతదేహాలను తీసుకువచ్చామని అంబులెన్స్ సేవల డైరెక్టర్ తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే తీవ్రవాద గ్రూపు అల్-షబాబ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంటూనే ఉంది.

మొగదీషులో పేలుడు జరిగిన సమయం కూడా షాకింగ్‌గా ఉంది. వాస్తవానికి, తిరుగుబాటును ఎదుర్కోవడానికి సోమాలియా అధ్యక్షుడు, ప్రధాని మరియు ఇతర సీనియర్ అధికారులు రాజధానిలో సమావేశమయ్యారు. ఇది ప్రత్యేకంగా అల్-ఖైదాతో సంబంధం ఉన్న అల్-షబాబ్ గ్రూపుతో వ్యవహరించడం గురించి చర్చిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం