పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తెకు షాక్.. ఆసిఫా జర్దారీ కాన్వాయ్‌పై దాడి!
పాకిస్తాన్‌పై అన్ని అస్త్రాల కంటే వాటర్ బాంబ్ గట్టిగా పనిచేస్తోంది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా దీనిపై ఆ దేశ ఎంపీలు గళమెత్తారు. సింధూ జలాలను విడుదల చేయాలని భారత్‌ను వేడుకుంటున్నారు. మరోవైపు పాక్ ప్రజలకు రోడ్లపైకి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
పాకిస్తాన్‌పై అన్ని అస్త్రాల కంటే వాటర్ బాంబ్ గట్టిగా పనిచేస్తోంది. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా దీనిపై ఆ దేశ ఎంపీలు గళమెత్తారు. సింధూ జలాలను విడుదల చేయాలని భారత్‌ను వేడుకుంటున్నారు. మరోవైపు పాక్ ప్రజలకు రోడ్లపైకి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
సింధ్‌లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె కాన్వాయ్‌ను చుట్టుముట్టి, కర్రలతో దాడి చేశారు. కరాచీ నుండి నవాబ్‌షాకు ప్రయాణిస్తున్న ఆసిఫా భుట్టో జర్దారీ కాన్వాయ్‌ను జంషోరో టోల్ ప్లాజా సమీపంలో నిరసనకారులు కొంతసేపు అడ్డుకున్నారు. కాలువ ప్రాజెక్టు, కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, భద్రతా దళాలు కాన్వాయ్‌ను సురక్షితంగా పంపించేశారు. ఇందుకు సంబంధించి కొంతమంది అనుమానితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
పాకిస్తాన్‌లో, కరాచీ నుండి సింధ్‌లోని నవాబ్‌షాకు ప్రయాణిస్తున్న జాతీయ అసెంబ్లీ సభ్యురాలు, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె ఆసిఫా భుట్టో జర్దారీ కాన్వాయ్‌ను రోడ్డుపై నిరసనకారులు చుట్టుముట్టారు. ఆమె జంషోరో టోల్ ప్లాజా గుండా వెళుతుండగా, కాలువ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న నిరసనకారులు ఆమెను కొద్దిసేపు ఆపి, కాన్వాయ్‌పై కర్రలతో దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. దీంతో హైవేపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివాదాస్పద కాలువ ప్రాజెక్టుకు, కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని నిరసనకారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు రైతులు, సాధారణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని మండిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన సమయంలో, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై, ఆసిఫా జర్దారీ వాహనాన్ని సురక్షితంగా పంపించి వేశారు.
ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, కొంతమంది అనుమానితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఎవరైనా ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రతా దళాలు ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తామని, సామాజిక శాంతిని కాపాడటానికి అప్రమత్తంగా ఉండాలని ఎస్ఎస్‌పీ చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
