Asaduddin Owaisi: ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది.. అలా చేస్తే, మొత్తం మానవాళిని చంపినట్లే..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా పాక్‌లో కేవలం ఉగ్రవాద స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ విచక్షణ కోల్పోయి సరిహద్దుల్లో జనవాసాలపై కాల్పులు జరిపి సాధారణ పౌరులను పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉగ్రచర్యలకు తన ప్రతిస్పందన ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కి భారత్ చూపించిందన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా పాక్‌లో కేవలం ఉగ్రవాద స్థావరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ విచక్షణ కోల్పోయి సరిహద్దుల్లో జనవాసాలపై కాల్పులు జరిపి సాధారణ పౌరులను పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉగ్రచర్యలకు తన ప్రతిస్పందన ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కి భారత్ చూపించిందన్నారు. శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా శనివారం అమెరికాకు చెందిన అధికారులతో భేటీ అయి.. పహల్గామ్ ఘటన.. ఆపరేషన్ సిందూర్.. ఆ తర్వాత పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ.. పాక్ ప్రోద్బలంతోనే పహల్గామ్ పర్యాటకులపై దాడి జరిగిందని.. ఉగ్రదాడులను భారత్ ఎట్టి పరిస్థితుల్లో సహించదని.. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదని స్పష్టంచేశారు. వారు మొదలుపెట్టారు.. తాము బదులిచ్చామని.. ఉగ్రవాదం నశించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుందని.. ఈ విషయంలో ఏం తెలియనట్లు దుర్భు్ద్ధిని ప్రదర్శిస్తుందంటూ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా పర్యటన తర్వాత ఈ బృందం గయానా, పనామా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు వెళ్తుంది.
అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలాఉంటే.. బీజేపీ ఎంపి బైజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం బహ్రెయిన్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఉగ్రవాద గ్రూపులు అమాయక ప్రజలను చంపడానికి మతాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుందని, ఒక అమాయకుడిని చంపడం మొత్తం మానవాళిని చంపినట్లే అని ఖురాన్ స్పష్టంగా చెబుతుందని ఆయన అన్నారు. పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. మరింత దూకుడుగా బదులిచ్చేందుకు భారత్ సిద్ధమని ఒవైసీ పేర్కొన్నారు. ఈసారి ప్రతిదాడులు మామూలుగా ఉండవు.. పాక్‌కు సరైన బుద్ధి చెబుతామంటూ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
VIDEO | Here’s what AIMIM leader Asaduddin Owaisi (@asadowaisi) said answering a question during a meeting with prominent Indians and civil society members in Bahrain as part of the diplomatic outreach.
“Our government has sent us here, and various other delegations comprising… pic.twitter.com/e64mwzveJJ
— Press Trust of India (@PTI_News) May 24, 2025
బహ్రెయిన్‌లోని ప్రముఖ వ్యక్తులతో జరిగిన సంభాషణలో ఒవైసీ మాట్లాడుతూ.. “ఈ ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో అమాయకుల హత్యలను సమర్థించాయి.. వారు సందర్భానికి భిన్నంగా ఖురాన్ వాక్యాలను ఉటంకించారు. మనం దానిని అంతం చేయాలి. వారు ప్రజలను చంపడాన్ని సమర్థించడానికి మతాన్ని ఉపయోగించారు. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది .. ఒక అమాయకుడిని చంపడం మొత్తం మానవాళిని చంపడం లాంటిదని ఖురాన్ స్పష్టంగా పేర్కొంది.”
డీఎంకే ఎంపి కనిమొళి కరుణానిధి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం రష్యాలో పర్యటించింది.. మాస్కో పర్యటనలో భాగంగా అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాదం, పహల్గామ్ ఘటన.. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. ఈ సందర్భంగా రష్యా భారత్ కు మద్దతు తెలిపింది. రాజీలేని ఉమ్మడి పోరాటానికి తన నిర్ణయాత్మక నిబద్ధతను రష్యా పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా కనిమొళి విలేకరులతో మాట్లాడుతూ.. ఇస్లామాబాద్ నుండి అణు ముప్పు ఆమోదయోగ్యం కాదని, పాకిస్తాన్ సైనిక చర్యలకు భారతదేశం దృఢంగా స్పందిస్తుందని అన్నారు. భారత్ వైఖరిని వివరించడానికి విదేశీ పర్యటన ఒక గొప్ప అవకాశంగా అభివర్ణించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను రక్షించడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తూ.. శాంతి చర్చలంటే తాము సిద్ధంగా లేమని భారతదేశం చాలా స్పష్టంగా చెప్పిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
