NITI Aayog: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్.. 4 ట్రిలియన్ డాలర్లుగా..
ప్రపంచాన్ని ఏలుతామంటున్న భారత్, ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. విశ్వగురుగా మారతామన్న ఇండియా, మరో మెట్టును చేరింది. 140 కోట్ల మంది ఆకాంక్షలకు అద్దం పడుతూ, ఇప్పుడు ఆర్థికరంగంలో బాహుబలిగా మారుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూసేద్దాం.. అదేంటంటే ఇలా..

ప్రపంచాన్ని ఏలుతామంటున్న భారత్, ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. విశ్వగురుగా మారతామన్న ఇండియా, మరో మెట్టును చేరింది. 140 కోట్ల మంది ఆకాంక్షలకు అద్దం పడుతూ, ఇప్పుడు ఆర్థికరంగంలో బాహుబలిగా మారుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూసేద్దాం..
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది. ఈ క్రమంలోనే జపాన్‌ను అధిగమించింది ఇండియా. 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదిగింది. నిన్నటి నీతిఆయోగ్ సమావేశంలో భారత ఆర్థికవృద్ధికి సంబంధించిన IMF గణాంకాలను నీతిఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం వివరించారు. ఇప్పుడు ప్రపంచంలో టాప్ త్రీ ఆర్థికవ్యవస్థల్లో అమెరికా, చైనా, జర్మనీ ఉన్నాయి. 2047కల్లా మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదుగుతామని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. ఇందుకు తగినట్లు నీతిఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారు ప్రధాని మోదీ.
ఆపిల్ ఫోన్ల తయారీ అమెరికాలోనే జరగాలన్న ఆ దేశ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు నీతిఆయోగ్ సీఈఓ స్పందించారు. సుంకాలు ఎంత విధిస్తారన్న దానిపై ఇంకా అనిశ్చిత నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్.. ఆపిల్ ఫోన్లను చౌకగా తయారు చేయగల దేశంగా ఉంటుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. కాగా, సెకండ్ రౌండ్ ఆఫ్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను సిద్ధం చేస్తున్నామని, ఆగస్టులో దీనిని ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు.




