Misal Pav: 100 ఏళ్లనాటి స్ట్రీట్ ఫుడ్ మిసల్ పావ్‌కు అరుదైన ఘనత.. ప్రపంచంలో టాప్ రేటింగ్ పొందిన వేగన్ వంటల్లో ఒకటి

|

Apr 25, 2023 | 11:52 AM

ప్రపంచంలోని ఉత్తమ సాంప్రదాయ వేగన్ వంటకాల జాబితాలో మరోసారి ఈ వంటకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని ఉత్తమ రేటెడ్ శాకాహారి వంటకాల ర్యాంకింగ్‌ల జాబితాలో మిసల్ పావ్ 11వ స్థానానికి చేరుకుందని వెల్లడించింది. 

Misal Pav: 100 ఏళ్లనాటి స్ట్రీట్ ఫుడ్ మిసల్ పావ్‌కు అరుదైన ఘనత.. ప్రపంచంలో టాప్ రేటింగ్ పొందిన వేగన్ వంటల్లో ఒకటి
Misal Pav
Follow us on

ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని ఉత్తమ-రేటింగ్ పొందిన శాకాహారి వంటకాల ర్యాంకింగ్‌ల జాబితాలో మిసల్ పావ్ కు చోటు దక్కింది. ఈ మరాఠీ వంటకానికి 11వ స్థానం దక్కింది.  మహారాష్ట్రలోని మరాఠీ స్ట్రీట్ ఫుడ్స్ లో ఒకటి స్పైసీ మిసల్ పావ్. ఇది పావ్ భాజీ లేదా వడా పావ్‌కి భిన్న రూపం అనిపిస్తుంది. ఈ మిసల్ పాప్ ప్రత్యేకమైన ఆహారాల సమ్మేళనం. ఈ మిసాల్ పావ్ దాదాపుగా మీల్ ప్రిపరేషన్ ఫుడ్ లాగా ఉంటుంది. ఈ 100 ఏళ్ల నాటి స్ట్రీట్ ఫుడ్  వైవిధ్యాలతో మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందింది. తోపుడు బండ్లు, స్ట్రీట్ ఫుడ్, ఫ్యాక్టరీ క్యాంటీన్‌ల నుండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫైన్ డైన్ రెస్టారెంట్‌ల వరకు ఉండే ఆహారాల్లో మిసల్ పావ్ ఒకటి. మొలక ధాన్యం ,ఒక రకమైన బ్రెడ్ రోల్‌తో తయారు చేయబడిన స్పైసీ కూర ఉంటుంది. సెవ్, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కొత్తిమీరతో తయారు చేసి.. కాల్చిన బన్నుతో అందిస్తారు. మిసాల్ పావ్‌లో అనేక రకాలు ఉన్నాయి. దీనిని తయారు చేసే పదార్థాలను బట్టి రుచి మారుతుంది. పూణే మిసాల్, ఖండేషి మిసాల్, నాసిక్ మిసాల్, అహ్మద్‌నగర్ మిసాల్ అత్యధికంగా ఫేమస్.

2015లో లండన్‌లోని ఫుడీ హబ్ అవార్డ్స్‌లో ఇది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన శాఖాహార వంటకంగా పేరుపొందింది . ఈ అవార్డును ప్రత్యేకంగా మిసల్ పావ్ గెలుచుకుందని దాదర్స్ ఆస్వాద్ రెస్టారెంట్ యజమాని చెప్పారు. చాలా మంది ముంబైవాసుల హృదయాన్ని మిసల్ పావ్ గెలుచుకుంది. ఈ రెస్టారెంట్‌ను 1986లో బాల్ థాకరే ప్రారంభించారు. 2015లో ఈ రెస్టారెంట్ లో ప్రతిరోజూ 400 ప్లేట్ల కంటే ఎక్కువ మిసాల్ పావ్‌ను ఆహారప్రియులు ఆస్వాదించారు.

ప్రపంచంలోని ఉత్తమ సాంప్రదాయ వేగన్ వంటకాల జాబితాలో మరోసారి ఈ వంటకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫారమ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని ఉత్తమ రేటెడ్ శాకాహారి వంటకాల ర్యాంకింగ్‌ల జాబితాలో మిసల్ పావ్ 11వ స్థానానికి చేరుకుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఆండ్రీ కోప్టి, ఫాసోల్ బటుటా, మాయక్ గింబాప్ వంటి ఇతర ప్రసిద్ధ శాకాహారి వంటకాల కంటే ర్యాకింగ్ లో ముందు ఉంది మిసల్ పావ్.

అంతేకాదు మరో మూడు ఇతర భారతీయ శాఖాహార పదార్ధాలు ప్రపంచ వ్యాప్తంగా ఆహారప్రియులకు ఇష్టమైనవి. ఆలూ గోబీ, రాజ్మా , గోబీ మంచూరియన్ వంటకాలు కూడా టాప్ 25లో నిలిచాయి. ఆలూ గోబీ 20వ స్థానంలో నిలవగా, , రాజ్మా 22వ స్థానంలో నిలిచింది . గోబీ మంచూరియన్ 24వ స్థానంలో నిలిచింది.
మసాలా వడ 27వ స్థానంలో, భేల్‌పురి 37వ స్థానంలో, రాజ్మా చావల్ 41వ స్థానంలో నిల్చింది. మొత్తంగా ఏడు భారతీయ శాకాహారి వంటకాలు టాప్ 50లో ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..