Telangana: తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడులపై అమెరికా NRIలకు మంత్రి ప్రజెంటేషన్

|

Oct 09, 2024 | 11:36 AM

పర్యాటకంతో పాటు తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడుల అవకాశాలను అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలకు వివరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు.

Telangana: తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడులపై అమెరికా NRIలకు మంత్రి ప్రజెంటేషన్
Minister Jupally Krishna Rao
Follow us on

సీఎం రేవంత్ ఆలోచనలకు తగ్గట్టుగా తెలంగాణ‌ చరిత్ర, సంస్కృతి, వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు కొత్త టూరిజం పాలసీని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణకు ప‌ర్యాట‌కుల‌ను ఆకర్షించడంతో పాటు ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ఆవిష్కరించడమే ల‌క్ష్యంగా ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.

లాస్ ఎంజెల్స్‌లోని డబుల్ ట్రీ హోటల్‌లో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. సంప్రదాయం, ఆధునికత రెండింటి క‌ల‌బోత తెలంగాణ అని అభివ‌ర్ణించారు జూపల్లి. తెలంగాణ సంస్కృతి, జాన‌ప‌ద క‌ళ‌లు, ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, బతుకమ్మ పండుగ గొప్పతనం, పెట్టుబడుల అవకాశాలను మంత్రి ఎన్‌ఆర్‌ఐలకు వివరించారు. కొత్త ప్రదేశాలను చుట్టేసి, కొత్త అనుభూతులు, సరికొత్త అనుభవాలు పోగేసుకోవాల‌ని అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందన్నారు. పర్యాటకంతో పాటు తెలంగాణలో పెరుగుతున్న పెట్టుబడుల అవకాశాలను ప్రస్తావించారు.

హైదరాబాద్ నగరం దేశంలో మినీ ఇండియాగా ప్రసిద్ధి పొందిందని, ఆ నగరం ప్రపంచస్థాయి ఐటీ, ఫార్మా ఫార్మాస్యూటికల్ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఎదిగిందన్నారు. తమ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ అంశాన్ని ప్రవాస భారతీయులకు వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా IT, హెల్త్ కేర్, ఫార్మా పరిశ్రమల్లో అద్భుతమైన పెట్టుబడులు కల్పించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడిదారుల ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి