Niger: ఆర్మీ పాలనలోకి మరో దేశం.. ఆ దేశ అధ్యక్షుడిని ఖైదీ చేసిన సైన్యం .. దేశ సరిహద్దులు మూసివేత..

|

Jul 27, 2023 | 11:18 AM

2021లో మహ్మద్ బాజుమ్ నైజర్ అధ్యక్షుడిగా పదవిని చేపట్టారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం..  అధికార పీఠం ఎక్కకముందే తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. నైజర్ అధ్యక్షుడు బజుమ్‌కు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది. తమ దేశంలో ఉన్న అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై నిరంతరం చర్యలు తీసుకుంటున్నాడు.

Niger: ఆర్మీ పాలనలోకి మరో దేశం.. ఆ దేశ అధ్యక్షుడిని ఖైదీ చేసిన సైన్యం .. దేశ సరిహద్దులు మూసివేత..
Niger Coup
Follow us on

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్ లో  బుధవారం తిరుగుబాటు జరిగింది. ప్రస్తుత దేశాధ్యక్షుడైన మహ్మద్ బెజోమ్‌ ను ఖైదీగా బంధించారు. దీంతో ఆర్మీ అధికారులు దేశ పాలనపై పట్టుసాధించారు. అంతేకాదు ఇక నుండి తామే దేశాన్ని పాలించనున్నామని ప్రకటించారు కూడా.. ఇదే విషయాన్ని నైజర్ ఆర్మీ మెన్ లైవ్ టీవీలో వచ్చి మరీ ప్రజలకు చెప్పారు. దీంతో ఆ దేశ ప్రజలతో సహా ప్రపంచం ఒక్కసారిగా ఉల్కిపడింది. నైజర్‌లో జరిగిన ఈ ఘటనను ప్రపంచంలోని పలు దేశాలు ఖండించాయి.

అంతర్జాతీయ ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ వార్తల ప్రకారం దేశంలోని అన్ని సంస్థలు మూసివేయబడ్డాయి. అంతేకాదు ఆ దేశ సరిహద్దులు కూడా మూసివేసిన ఆర్మీ.. తమ దేశంలోకి బయట దేశాల నుంచి ఎటువంటి వ్యక్తులు అడుగు పెట్టడానికి వీలు లేదని.. ఎటువంటి కదలిక సాధ్యం కాదని నైజర్ సైనిక అధికారులు ప్రకటించారు. రాష్ట్రపతి బుధవారం నుంచి బందీగా ఉన్నారు.

రాష్ట్రపతి భవన్ దగ్గర మద్దతుదారుల ఆందోళన 

ఇవి కూడా చదవండి

రాష్ట్రపతి అరెస్టు వార్త తెలిసిన వెంటనే ఆయన మద్దతుదారులు రాష్ట్రపతి భవన్ దగ్గరకు చేరుకున్నారు.  మహ్మద్ బెజోమ్‌ ను సొంత అంగరక్షకులు బంధించారని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి.

2021లో మహ్మద్ బాజుమ్ నైజీరియా అధ్యక్షుడిగా పదవిని చేపట్టారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం..  అధికార పీఠం ఎక్కకముందే తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. నైజర్ అధ్యక్షుడు బజుమ్‌కు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది. తమ దేశంలో ఉన్న అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై నిరంతరం చర్యలు తీసుకుంటున్నాడు. వాస్తవానికి 1960 నుండి నైజర్ నాలుగు సార్లు సైనిక పాలనలో ఉంది.

నైజర్కు ప్రపంచం మద్దతు

పశ్చిమ ఆఫ్రికా దేశంలో జరిగిన ఈ తిరుగుబాటు తర్వాత వివిధ దేశాల స్పందించాయి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆర్మీ చేపట్టిన ఈ చర్యను ఖండించారు. అధ్యక్షుడు మహ్మద్ బెజోమ్‌కు తన మద్దతును ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా మహ్మద్ బెజోమ్‌కు అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పారు.

పశ్చిమ ఆఫ్రికాలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో నైజర్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని, పాశ్చాత్య దేశాలు, ఐక్యరాజ్యసమితి నైజర్ సహాయంతో అనేక ప్రధాన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

ఆర్మీ తరపున తిరుగుబాటును ప్రకటించిన కల్నల్ మేజర్ అమ్దౌ అబ్రహమెన్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాన్ని అంతం చేయాలని సైన్యం నిర్ణయించిందని, దేశంలో దారుణమైన పరిస్థితి ఏర్పడిందని.. అందుకనే తాము ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. దేశంలోని అన్ని సంస్థలు మూతపడ్డాయి. కేబినెట్‌లోని వ్యక్తులు మాత్రమే దేశంలోని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారని తమ దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రపంచ దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..