Mexico: మెక్సికోను ముంచెత్తుతున్న అగాథ.. తుపాను బీభత్సానికి నీటమునిగిన దేశం

|

Jun 06, 2022 | 8:11 AM

మొన్న బ్రెజిల్‌.. నిన్న బంగ్లాదేశ్‌.. నేడు మెక్సికో.. ఇలా పలు దేశాలు వరుస తుఫాన్‌లతో అతలాకుతలం అవుతున్నాయి. తాజాగా మెక్సికో(Mexico) లో అగాథ తుఫాన్ తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటి వరకు...

Mexico: మెక్సికోను ముంచెత్తుతున్న అగాథ.. తుపాను బీభత్సానికి నీటమునిగిన దేశం
Mexico Floods
Follow us on

మొన్న బ్రెజిల్‌.. నిన్న బంగ్లాదేశ్‌.. నేడు మెక్సికో.. ఇలా పలు దేశాలు వరుస తుఫాన్‌లతో అతలాకుతలం అవుతున్నాయి. తాజాగా మెక్సికో(Mexico) లో అగాథ తుఫాన్ తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటి వరకు పదుల సంఖ్యంలో ప్రజలు చనిపోయినట్టు తెలుస్తోంది. అంతకు రెట్టింపు గల్లంతయ్యారు. గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 1949 తర్వాత మెక్సికోను తాకిన అతిపెద్ద తుఫాన్ ఇదేనని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అగాథ తుపాను (Agatha Cyclone) ధాటికి మెక్సికో వణికిపోతోంది. ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. అగాథా హ‌రికేన్ అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ హ‌రికేన్ వ‌ల్ల కొండ‌ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. దీంతో రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. ఈ హ‌రికేన్ వ‌ల్ల దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితి ఏర్పడ్డాయి. హరికేన్ అగాథ ఈ సంవత్సరం పసిఫిక్ సీజన్ లో ఏర్పడిన మొదటి హరికేన్. కేటగిరీ టూ హరికేన్ గా అగాథ ఓక్సాకాలోని ప్యూర్టో ఏంజెల్ సమీపంలో తీరం దాటింది. అయితే హ‌రికేన్ వ‌ల్ల క‌లిగిన మ‌ర‌ణాలు వెల్లడించేందుకు ఓక్సాకా గవర్నర్ అలెజాండ్రో మురాట్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వ‌ర‌కు అధికారికంగా తొమ్మిది మరణాలు సంభ‌వించాయ‌ని తెలిపారు.

హరికేన్ కారణంగా సంభవించిన మరణాలపై మెక్సికన్ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ విచారం వ్యక్తం చేశారు. ఈ హరికేన్ బారిన పడిన ఓక్సాకా నివాసితులు ఒంటరిగా లేరని ఆయన అన్నారు. యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకారం.. ఈ అగాథ 1949 సంవ‌త్సరం నుంచి మే నెలలో మెక్సికోను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను. మెక్సికో వాతావరణ సేవ ప్రకారం.. రాబోయే కొద్ది రోజుల్లో హరికేన్ అట్లాంటిక్ వైపు కదులుతోంది. మరొక తుఫాను ఏర్పడే అవకాశం 80 శాతం ఉంది. మెక్సికో సాధారణంగా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల నుంచి మే, నవంబర్ నెలల మధ్య ఉష్ణమండల తుఫానుల ప్రభావానికి గుర‌వుతుంది. 2021 లో గ్రేస్ మూడో హరికేన్ మెక్సికోను తాకింది. దీని ప్రభావం వల్ల 11 మంది చ‌నిపోయారు. 1997 లో కేటగిరీ 4 పౌలిన్ హరికేన్ దేశంలోని పసిఫిక్ తీరాన్ని తాకిన తరువాత దాదాపు 200 మంది మృతి చెందారు.

అగాథ తుఫాన్‌ ధాటికి చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. జనావాసాలు నీట మునిగాయి. రహదారులు జలమయం అయ్యాయి. చాలా చెట్లు నేలకూలాయి. కొన్ని రోడ్లు కొట్టుకుపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని గంటల పాటు ఆగకుండా వీచాయి. బీభత్సమైన గాలులకు పట్టణాలు వణికిపోతున్నాయి. వరదలు, గాలులతో చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పెర్నాంబుకోలోని సుమారు 24 మున్సిపాలిటీలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఆ రాష్ట్రంలో సుమారు ఆరు వేల మందికిపైగా నిరాశ్రయులైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి