Third Wave: భయపడినట్టే జరిగింది.. ఆ దేశంలో మొదలైన కరోనా థర్డ్ వేవ్.. బాధితుల్లో వారే ఎక్కువ

| Edited By: Janardhan Veluru

Jul 11, 2021 | 7:47 AM

ఆ దేశంలో గత వారం రోజులుగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మునుపటి వారంతో పోల్చితే ఈ వారం 29 శాతం ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Third Wave: భయపడినట్టే జరిగింది.. ఆ దేశంలో మొదలైన కరోనా థర్డ్ వేవ్.. బాధితుల్లో వారే ఎక్కువ
Mexico Third Wave
Follow us on

Mexico Third Wave: మెక్సికోలో కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యింది. గత వారం రోజులుగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మునుపటి వారంతో పోల్చితే ఈ వారం 29 శాతం ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారంనాడు 9 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  అక్కడ సెకండ్ వేవ్ గత ఏడాది సెప్టెంబర్ మాసంలో మొదలయ్యింది. జనవరి మాసంలో ఉధృతి తారస్థాయికి చేరింది. క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ జులై మాసంలో సెకండ్ వేవ్ ముగిసింది. సెకండ్ వేవ్ ముగిసినందుకు ప్రజలు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్న వేళ..మరో నెల రోజుల వ్యవధిలోనే అక్కడ థర్డ్ వేవ్ మొదలయ్యింది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు మెక్సికో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా పేషంట్స్ కోసం సిద్ధం చేసిన ఆస్పత్రి బెడ్స్‌లో 22 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. సెకండ్ వేవ్ ఉధృతిగా ఉన్న సమయంలో అక్కడి ఆస్పత్రుల్లోని బెడ్స్ అన్ని రోగులతో నిండిపోయాయి.

థర్డ్ వేవ్‌లో ఎక్కువగా యువకులు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ బారినపడుతున్నట్లు మెక్సికో దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే వ్యాధి సోకేందుకు తక్కువ అవకాశాలున్న వారిలో ఎక్కువగా కరోనా ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. యువకులు, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ అనుకున్న వారు వ్యాక్సిన్లు వేసుకోకపోవడమే థర్డ్ వేవ్‌లో వారు కరోనా బారినపడుతుండటానికి కారణంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే వృద్ధులు తక్కువ సంఖ్యలోనే థర్డ్ వేవ్‌లో కరోనా బారినపడుతున్నారు. వృద్ధులకు వ్యాక్సినేషన్‌ను గణనీయ స్థాయిలో పూర్తి చేయడమే దీనికి కారణమని భావిస్తున్నారు. శుక్రవారంనాటికి దేశంలోని వయోజనుల్లో 39 శాతం మందికి ఒక వ్యాక్సిన్ పూర్తయినట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు.

Covid Cases

అదే సమయంలో దేశంలో థర్డ్ వేవ్ మొదలుకావడానికి డెల్టా వేరియంట్ కారణమన్న వాదనను కూడా మెక్సికో ఆరోగ్య శాఖ అధికారులు తోసిపుచ్చారు. సెకండ్ వేవ్ సద్దుమణగడంతో ప్రజా రవాణా మొదలుకావడం, ఆఫీస్‌లు తెరవడం, దుకాణాలు తెరుచుకోవడం, ఇతర కార్యకలాపాలు ప్రారంభించడమే థర్డ్ వేవ్‌కు కారణమవుతోందని విశ్లేషించారు. రెండు వేవ్‌లలో మెక్సికో నగరంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు థర్డ్ వేవ్‌లోనూ ఆగస్టు మాసంలో మెక్సికో నగరంలో థర్డ్ వేవ్  ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనావేస్తున్నారు.

మెక్సికో‌లో దాదాపు 13 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ దేశ అధికారిక గణాంకాల మేరకు ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా మహమ్మారి బారినపడి 2,35,000 మంది చనిపోయారు. అయితే వాస్తవ కరోనా మృతుల సంఖ్య  3,60,000 గా ఉండొచ్చని అంచనావేస్తున్నారు.

Also Read..

గేదె శిశువులో బవిన్ వైరస్ ..! జంతువుల నుంచి మానవులకు వచ్చే అవకాశం..

 జూలై 17 నుంచి శబరిమల ఆలయం ఓపెన్.. COVID-19 నిబంధనలు కఠినంగా అమలు..