Kickbacks Rafale Deal: రఫేల్ డీల్‌లో అవినీతి జరిగిందా? ఇప్పటికే సమసిపోయిన సమస్యను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది ఫ్రెంచ్ పత్రిక. దీంతో అవినీతి వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. రఫేల్ పీడ ఇంకా విరగడ కాలేదు. ఓవైపు యుద్ధ విమానాలు జెట్ స్పీడులో వస్తుంటే.. మరోవైపు అవినీతి ఆరోపణలు కూడా అదే స్పీడుతో షికారుచేస్తున్నాయి. గతంలో వచ్చిన ఆరోపణలను కోర్టులు కొట్టేశాయి. కాని ప్రతిపక్షాలు ఇప్పటికీ ఈ డీల్‌పై అనుమానాలతోనే ఉన్నాయి. ఇప్పుడు వారికి ఊతమిస్తూ.. ఓ ఫ్రెంచ్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్‌తో డీల్ కుదరడానికి దసాల్ట్ ఏవియేషన్ భారీగా లంచం ఇచ్చిందంటూ కథనం రాసింది మీడియా పార్ట్ అనే పత్రిక.
ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ దసాల్ట్, సుసేన్ గుప్తా అనే మధ్యవర్తికి 7.5మిలియన్ యూరోలు అంటే.. 65 కోట్ల రూపాయల లంచం రహస్యంగా ఇచ్చింది. ఇందుకోసం బోగస్ ఇన్‌వాస్‌లు తయారుచేశారు. ఇప్పటికే ఫ్రాన్స్ ప్రభుత్వం డీల్‌లో జరిగిన అవినీతిపై ఓ జడ్జ్‌తో విచారణ జరిపిస్తోంది. బోగస్ ఇన్‌వాయిస్‌లు ఉన్నా.. భారత్ దర్యాప్తు సంస్థ CBI మాత్రం విచారణ చేపట్టలేదని ఆ పత్రిక ఆరోపించింది.
సుసేన్ గుప్తా షెల్ కంపెనీ సేవలను ఉపయోగిస్తున్నామంటూ దసాల్ట్ ఏవియేషన్ అనేక బిల్లులు ఆ కంపెనీకి చెల్లించింది. ఏషియాలో సిస్టమ్ ఇంటిగ్రేటర్ అనే ట్యాగ్‌తో అనేక వేల యూరోలు కంపెనీకి ఇచ్చింది. అలా అసలు మనుగడలోనే లేని కంపెనీకి బిల్లులు ఇచ్చి అవినీతికి పాల్పడిందంటూ పత్రిక రాసుకొచ్చింది.
అలా ఇవ్వడం వల్లే మధ్యవర్తి సుసేన్ గుప్తా.. భారత ప్రభుత్వంతో రఫేల్ డీల్ కుదిర్చినట్లు ఆరోపణలు చేసింది. ఈ డీల్ మొత్తంలో దాదాపు 500 కోట్ల అవినీతి జరిగినట్లు ప్రచురించింది మీడియాపార్ట్ పత్రిక.
‘రాఫెల్ డీల్’ అనేది భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ నుండి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందం. సెప్టెంబరు 2016లో, భారతదేశం మరియు ఫ్రాన్స్ దీని కోసం ఒక అంతర్ ప్రభుత్వ ఒప్పందం (IGA)పై సంతకం చేశాయి.
ఇందులో గోప్యత లేదు..
రాఫెల్ డీల్‌లో ‘గోప్యత నిబంధన’ఉన్నందున , ఈ వాదనలు చాలా అర్థరహితంగా కనిపిస్తున్నాయి . ఇది జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను కలిగి ఉన్నందున ఒప్పందం గురించి వివరాలను వెల్లడించకుండా ప్రమేయం ఉన్న రెండు ప్రభుత్వాలలో దేనినీ నిరోధించింది. అలాగే, గత యుపిఎ హయాంలో ఉత్పత్తి నిబంధనలపై రెండు కంపెనీలు ఏకీభవించలేకపోయినందున హెచ్‌ఎఎల్‌ను డీల్ నుంచి తప్పించారనేది ముందే తెలిసిపోయింది. రాఫెల్ కాంట్రాక్ట్ కోసం భారతీయ కంపెనీలను ఎంపిక చేసుకునేందుకు ఫ్రాన్స్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అనిల్ అంబానీ తమ సొంత ఎంపిక అని, తాము ఏ రాజకీయ పార్టీ మాటల వల్ల ప్రభావితం కాలేదని డసాల్ట్ స్పష్టం చేసింది. నిందలతో విసిగిపోయిన అంబానీ కాంగ్రెస్‌పై పరువు నష్టం దావా వేస్తానన్న సంగతి తెలిసిందే.. వివరాలను కోరడం ద్వారా భారతదేశ భద్రతపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజీ పడ్డారని భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: లండన్‌లో ఎంబీఏ చేసి ఇండియాలో డెయిరీ ఫామ్ పెట్టాడు.. ఇప్పుడు లక్షలు గడిస్తున్నాడు..
Potato Juice: పొటాటో జ్యూస్ ఎప్పుడైనా తాగారా..! ఈ ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధం..