Plane Crashes: స్వీడన్‌లో కుప్పకూలిన విమానం.. ఎనిమిది స్కైడైవర్లతో సహా ఫైలట్ దుర్మరణం!

స్వీడన్ దేశంలో చిన్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు.

Plane Crashes: స్వీడన్‌లో కుప్పకూలిన విమానం.. ఎనిమిది స్కైడైవర్లతో సహా ఫైలట్ దుర్మరణం!
Plane Crashes In Sweden

Updated on: Jul 09, 2021 | 7:52 AM

Small Plane Crashes In Sweden: స్వీడన్ దేశంలో చిన్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. స్వీడన్ దేశంలోని ఒరెబ్రో నగర విమానాశ్రయం నుంచి చిన్న విమానం గురువారం బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. స్కై డైవర్స్‌ను మోస్తున్న విమానంలో పైలట్‌తో సహా 9 మంది ఉన్నారు. స్వీడన్‌లోని ఒరెబ్రో వెలుపల గురువారం కుప్పకూలిన విమానంలో ఉన్న మొత్తం తొమ్మిది మంది చనిపోయినట్లు స్వీడన్ పోలీసులు తెలిపారు.

చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ (సిజిటిఎన్) ప్రకారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరేబ్రోలో DHC-2 టర్బో బీవర్ అనే విమానం ఎనిమిది స్కైడైవర్లు ఒక ఫైలట్‌తో వెళ్తోంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇది ఒరెబ్రో విమానాశ్రయంలోని రన్‌వేకి దగ్గరగా కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అందరూ మరణించారని స్వీడన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే, తీవ్ర గాయాలతో ఉన్న ఓ విమాన ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించినట్లు సిజిటిఎన్ నివేదించింది.ఈ విమాన ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారికి స్వీడన్ ప్రధాన మంత్రి స్టీఫన్ లోఫ్వెన్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ విమాన ప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also….. Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. వచ్చే 14 రోజులు కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!