చైనాలో 100 కిలోమీటర్ల సుదీర్ఘ క్రాస్ కంట్రీ మౌంటెయిన్ మారథాన్ రేసుపై ప్రకృతి పగ బట్టింది. కొండలు, కోనలు, ఎత్తయిన ప్రదేశాల్లో ఈ మారథాన్ సాగుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గన్సు ప్రావిన్స్ లో ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు, వడగండ్ల తో బాటు ఈదురుగాలులతో కూడిన బీభత్స వాతావరణం ఏర్పడింది.(ఈ ప్రకృతి బీభత్సం కారణంగా 21 మంది మారధాన్లు మరణించారు). ఈ నెల 22 న కొండ ప్రాంతంపై తన గొర్రెలను మేపుకుంటున్న ఝూ కెమింగ్ అనే వ్యక్తి దీంతో బెదిరిపోయి దగ్గరలోనే ఉన్న చిన్న గుహలో తలదాచుకున్నాడు. అప్పటికే ఆ గుహలో కొని బట్టలు, ఆహార పదార్థాలు ఉంచుకున్న ఝూ.. కొద్దీ సేపటికి బయటికి వచ్చి చూసేసరికి మారథాన్ రన్నర్స్ లో కొందరు విపరీతమైన చలికి తట్టుకోలేక కింద పడిపోయి ఉండడం గమనించాడు. ఆ బీభత్స పరిస్థితుల్లోనే అతి కష్టం మీద వారిలో కొందరిని ఈ గుహలోకి తీసుకువచ్చి రక్షించాడు. వారికి తన బట్టలు కప్పి కాస్త వెచ్చదనం కల్పించాడు.. అంతటితో ఆగక మళ్ళీగుహ బయటికి వచ్చి చూసేసరికి మరి కొంత దూరంలో కొంతమంది పడిపోయి ఉండడం గమనించి మరో ముగ్గురిని ఈ చిన్నపాటి గుహలో చేర్చాడు. వీరంతా అక్కడి వెచ్చని వాతావరణానికి కాస్త సేద దీరారు . తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తమను కాపాడినందుకు అతడిని వారు ప్రశంసలతో ముంచెత్తారు. అతడికి కృతజ్ఞతలు తెలిపారు.
అయితే కొనఊపిరితో ఉన్న మరికొందరిని తాను రక్షించలేక పోయానని ఝూ బాధ పడుతున్నాడు. తన కళ్ళముందే వారు మరణించడం చూసి తట్టుకోలేకపోయానన్నాడు. ఈ గొర్రెల కాపరి నుంచి ప్రాణాలు కాపాడుకున్నవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చైనా లోని సోషల్ మీడియా ఇతడిని హీరోగా అభివర్ణిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఓటీటీలోకి రానా, సాయి పల్లవి సినిమా.. ‘విరాటపర్వం’ విడుదల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..