ఆస్ట్రేలియాలో షార్క్ చేపల పాలిట మొనగాడిగా పాపులరై ‘షార్క్ రైడర్’ అని నిక్ నేమ్ తెచ్చుకున్న అతగాడు వాటి పాలన బడి గాయాలకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. ఆరన్ మొయిర్ అనే 32 ఏళ్ళ ఇతనిపై వారనస్ దీవుల సమీపంలోని సముద్రంలో ఓ షార్క్ ఇటీవల దాడి చేసింది. ఇతని వీపు పైన, కాలు, కడుపు భాగంలో షార్క్ చేసిన ఎటాక్ తాలూకు గాయాలు కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు గానీ.. హాస్పిటల్ లో ఇతని పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉందట. సహాయక బృందం 15 గంటలపాటు ఓ బోటులో ప్రయాణించి వెళ్లి..శ్రమించి ఇతడిని ఆసుపత్రికి తరలించింది. లెమన్ జాతికి చెందిన సొరచేప ఇతనిపై దాడి చేసినట్టు భావిస్తున్నారు. సాధారణంగా ఈ జాతి షార్క్ చేపలు దాడి చేయవని, కానీ ఇతనిపై దాడి ఆశ్చర్యకరమేనని అంటున్నారు.
2014 లో సముద్రంలో బోటుపై నుంచి హామర్ హెడ్ షార్క్ మీదికి ఒక్కసారిగా జంప్ చేసి కెమెరాకెక్కాడట ఆరన్ మొయిర్.. అప్పటి నుంచి ఇలా వాటి మీద గంతులు వేస్తూ.. షార్క్ రైడర్ అనే తమాషా పేరు తెచ్చుకున్నాడు. తన చర్యలు మూర్ఖత్వంతో (స్టుపిడ్) కూడుకున్నవని తనకు తెలుసునని, కానీ మాటిమాటికీ ఈ విధమైన చర్యలకు పాల్పడుతూనే ఉంటానని ఆరన్ చెబుతూ వచ్చేవాడు. షార్క్ చేపలపై దూకడంఅంటే తనకు ఎంతో ఇష్టమని అంటున్నాడు. ఏది ఏమైనా వాటి పట్ల ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలని జంతు, సముద్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి హఠాత్తుగా దాడి చేస్తాయని అంటున్నారు. ఎంత మాలిమి చెందినా వాటి జోలికి పోరాదని వార్నింగ్ ఇస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Vizag: ఖతర్నాక్ దొంగల ముఠా.. సినిమా స్టైల్లో ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు..
ఇంగ్లండ్‌లో ధోని స్నేహితుడి సూపర్ ఇన్నింగ్స్.. హ్యాట్రిక్‌తో ప్రతర్థి నడ్డి విరిచాడు..!