AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: డబ్బులు డ్రా చేస్తుండగా దోచుకునేందుకు యత్నం.. పెనుగులాటలో దొంగ ముసుగు తీయగా మైండ్ బ్లాంక్!

ఓ యువకుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చాడు. పని పూర్తి చేసుకుని కార్డు తన జేబులో పెట్టుకుంటుండగా.. ఒక్కసారిగా అలజడి..

Viral: డబ్బులు డ్రా చేస్తుండగా దోచుకునేందుకు యత్నం.. పెనుగులాటలో దొంగ ముసుగు తీయగా మైండ్ బ్లాంక్!
Representative Image
Ravi Kiran
|

Updated on: Mar 14, 2023 | 4:30 PM

Share

ఓ యువకుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చాడు. పని పూర్తి చేసుకుని కార్డు తన జేబులో పెట్టుకుంటుండగా.. ఒక్కసారిగా అలజడి.. ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి అతడిపై దాడి చేశాడు. గోడకు నొక్కేస్తూ డబ్బులు ఇవ్వమని కత్తితో బెదిరించాడు. కట్ చేస్తే.. ఆ ఆగంతకుడిపై రివర్స్ అయ్యాడు సదరు యువకుడు. అతడు వేసుకున్న ముసుగు లాగేశాడు. అంతే! అతడెవరో చూడగానే ఆ యువకుడికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. స్కాట్‌ల్యాండ్‌లోని గ్లాస్గోలో నివసిస్తున్న ఓ 17 ఏళ్ల యువకుడు తన ఇంటి దగ్గరలో ఉన్న ఏటీఎంలోకి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. డబ్బులు కలెక్ట్ చేసి.. కార్డ్ జేబులో పెట్టుకుంటుండగా.. ముసుగు ధరించిన ఓ ఆగంతుకుడు వచ్చి అతడ్ని గోడకు బలంగా నెట్టేసి.. వెనక్కి తిరగనివ్వకుండా నొక్కుతూ డబ్బులు ఇవ్వాలని మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. దీంతో ఆ యువకుడు కొంచెం భయపడినా.. గొంతు ఎక్కడో విన్నట్లు ఉందని.. మరోసారి ఏం కావాలంటూ అడుగుతాడు. ఇక ఆగంతకుడు అతడి మాటలు పట్టించుకోకుండా.. డబ్బులు ఇవ్వాలంటూ గట్టిగా అరుస్తాడు. అయితే ఈలోగా యువకుడు ధైర్యాన్ని కూడగట్టుకుని.. అతడిపై ఎదురుదాడికి దిగాడు. వెనక్కి తిరిగి ఆ ఆగంతకుడి ముఖం చూసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడి ముసుగును తొలగించాడు. అంతే.! ఆ వ్యక్తి మరెవరో కాదు.. అతడి తండ్రి.

‘ఇదేం పని..! అసలేం చేస్తున్నావ్ నాన్న..’ అంటూ నిలదీస్తాడు సదరు యువకుడు. వెంటనే ఏటీఎం బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఖాకీలు ఆ అగంతకుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. తన నేరాన్ని అంగీకరించిన ఆగంతకుడు.. ఏటీఎం వద్ద తన కొడుకు ఉన్నాడన్న సంగతి తెలియదని.. దొంగతనం చేయడానికే అక్కడి వచ్చానని తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు నిందితుడికి 26 నెలల జైలు శిక్షను విధించింది.

Follow Us
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
జెమిమా రోడ్రిగ్స్‌కు వాచ్‌మెన్ వార్నింగ్!
జెమిమా రోడ్రిగ్స్‌కు వాచ్‌మెన్ వార్నింగ్!
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు..ఆయన సినిమాలో విలన్‌గా చేస్తా
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!