Viral news: చెంప దెబ్బలు కొట్టేందుకు ప్రత్యేకంగా మహిళను నియమించుకున్న ఇండో- అమెరికన్.. ఎందుకంటే..
వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను చూస్తూ చాలామంది తమను తాము మర్చిపోతుంటారు. సమయాన్ని వృథాచేస్తూ చేస్తున్న పనులను సైతం పక్కన పెట్టి మరీ సామాజిక మాధ్యమాల్లో మునిగిపోతుంటారు..

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను చూస్తూ చాలామంది తమను తాము మర్చిపోతుంటారు. సమయాన్ని వృథాచేస్తూ చేస్తున్న పనులను సైతం పక్కన పెట్టి మరీ సామాజిక మాధ్యమాల్లో మునిగిపోతుంటారు. అయితే సోషల్ మీడియా ఖాతాలను ఎక్కువ వినియోగించడం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయని వ్యక్తిగత జీవితంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్రమంలో ఫేస్‌బుక్ వినియోగించిన ప్రతిసారీ తనని చెంప దెబ్బ కొట్టడానికి ఒక మహిళను నియమించుకున్నాడు వేరబుల్ డివైసెస్ బ్రాండ్ పావ్‌లోక్ వ్యవస్థాపకుడు మనేష్ సేథీ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం, బిలియనీర్ ఎలన్ మస్క్ సైతం దీనిపై స్పందించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతీయ అమెరికన్ అయిన మనేష్ సేథీ ఫేస్‌బుక్‌కు బాగా అడిక్ట్ అయ్యాడు. పనివేళల్లో సైతం అందులోనే మునిగి తేలేవాడు. దీనివల్ల అతని కంపెనీ మీద బాగా ప్రతికూల ప్రభావం పడింది.
నా పనితీరు మెరుగుపడింది.. ఈ క్రమంలో తన సమస్యను అధిగమించడం కోసం ఒక వినూత్న ఆలోచన చేశాడు మనేష్. ఇందులో భాగంగా తాను ఫేస్‌బుక్ తెరచిన ప్రతిసారీ అతనిని చెంప దెబ్బ కొట్టడానికి ప్రత్యేకంగా ఒక మహిళను నియమించుకున్నాడు. ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌లో ప్రకటన కూడా ఇచ్చాడు. ‘నేను వర్క్‌లో ఉన్నప్పుడు ఫేస్‌బుక్ వినియోగిస్తే నాపై అరవాలి. అప్పుడు కూడా వినకపోతే ఓ చెంప దెబ్బ కొట్టాలి. ఇదే జాబ్ డిస్ర్కిప్షన్. ఇందుకుగాను గంటకు 8 డాలర్లు వేతనంగా ఇస్తాను’ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా స్లాపర్ కారా అనే మహిళ ఈ ఉద్యోగానికి ఎంపికైందని, దీని తర్వాత తన పనితీరు బాగా మెరుగుపడిందని మనేష్ అంటున్నాడు. కాగా ఈ ప్రకటన 2012లో వచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సైతం ఈ పోస్టుపై స్పందించి రెండు ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశాడు.
The story of Maneesh Sethi, the computer programmer who hired a woman to slap him in the face every time he used Facebook, resulting in massive productivity increase [read more: https://t.co/Q5fKjYtFSo] pic.twitter.com/d8pnt3Jd8k
— Massimo (@Rainmaker1973) November 10, 2021
Also read:
Indian-origin American: భారత్‌కు చెందిన ఐటీ నిపుణుడికి జీవిత ఖైదు.. శిక్ష ఖరారు చేసిన అమెరికా కోర్టు
చెట్లకు కారుతున్న బంగారం.. జిగురుతో వ్యాపారస్థుల క్యాష్.. ఎక్కడంటే..? వీడియో
Kartik Purnima: కార్తీక పౌర్ణమిరోజున పాక్షిక చంద్రగ్రహణం.. మనదేశంలో ఎక్కడ కనిపించనున్నదంటే..
