Florida: ముచ్చటగా ముగ్గురిని పెళ్లాడిన వ్యక్తి.. తీరా అసలు విషయం తెలిశాక..
ప్రస్తుత రోజుల్లో అన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరుగుతున్న టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో ఇవి ఇప్పుడు తారా స్థాయికి చేరాయి. ఆన్‌లైన్‌లో స్నేహితులను వెతికిపెట్టే డేటింగ్ యాప్‌ల ద్వారా కొందరు కేటుగాళ్లు మహిళలను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అమోరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా.. డేటింగ్ యాప్‌లలో వారితో పరిచయం పెంచుకున్న ఓ కేటుగాడు.. ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. చివరకు పోలీస్ స్టేషన్ పాలయ్యాడు.

విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా చేసుకొని.. డేటింగ్ యాప్‌లలో పరిచయం పెంచుకొని.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం, ఫ్లోరిడాలో నివాసం ఉండే హెన్రీ బెట్సే జూనియర్ సోషల్ మీడియా, సహా ఇతర డేటింగ్ యాప్‌లలో యాక్టీవ్‌గా ఉండేవాడు. డేటింగ్ యాప్‌లలో విడాకుల తీసుకున్న మహిళల ప్రొఫైల్‌లను గుర్తించి.. మెళ్లగా వారితో పరిచయం పెంచుకునేవాడు. ఆ తర్వాత వాళ్లకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకునేవాడు. ఇలానే డేటింగ్ యాప్‌లో టోన్యా అనే మహిళతో పరిచయం పెంచుకున్న హెన్రీ..2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఆమెతో పెళ్లి బంధంలో ఉండగానే మరో మహిళను ట్రాప్ చేశాడు. ఇసారి మొదట వాడిన డేటింగ్ యాప్ కాకుండా మరో యాప్ ద్వారా బ్రాండీ అనే మరో విడాకులు తీసుకున్న మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు కూడా సేమ్ ఇలానే మాయమాటలు చెప్పి..2022 ఫిబ్రవరిలో అమెతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియకుండా చూసుకున్నాడు. ఇక ఇద్దరు సరిపోలేదు అన్నట్టు.. మరో డేటింగ్ యాప్ ద్వారా అదే ఏడాదిలో మిషెల్ అనే మరో మహిళను మోసం చేసి మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకు పెళ్లి జరిగినట్టు ఈ ముగ్గురిలో ఎవరికీ తెలియకుండా హెన్రీ జాగ్రత్త పడ్డాడు.
ముగ్గురిని పెళ్లి చేసుకున్న హెన్రీ అందరికీ సమయం ఇవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భర్త హెన్రీ ప్రవర్తనపై మొదటి భార్య అయిన టోన్యాకు అనుమానం వచ్చింది. దీంతో అతని గురించి తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో హెన్రీ తనతో పాటు మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నట్టు టోన్యా తెలుసుకుంది. వెంటనే హెన్రీ మూడో భార్య అయిన మిషెల్‌ను కలిసి జరిగిన విషయం మొత్తాన్ని చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన మిషెల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిషెల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెన్రీ అరెస్ట్ చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
