మాల్దీవులు గొడవ కాస్త సర్థుమణిగిన వేళ ఆ దేశంలోని మాలె మేయర్ ఎన్నికల్లో ముయిజ్జుకి గట్టి షాక్ తగిలింది. మాల్దీవులు రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్కు పార్టీ ఘోర పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో మాల్దీవులు అధ్యక్షునికి చెందిన పీఎన్సీ అభ్యర్థి కాకుండా.. భారత్కు అనుకూలమైన మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించింది. దీనికి కారణం గతంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలే అని స్పష్టం అవుతోంది. ఇటీవల భారత్, మాల్దీవులు దౌత్య సంబంధాలు తెగిపోయిన తరుణంలో ఇలాంటి రాజకీయ పరిణామం చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మాల్దీవియన్ డిమొక్రటిక్ పార్టీకి ప్రస్తుతం మహమ్మద్ సొలిహ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో భారత అనుకూల విధానాలను అనుసరించే మాజీ అధ్యక్షుడిగా ఉండేవారు. ప్రస్తుతం ఓటమికి కారణం భారత ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలే కాకుండా.. మాల్దీవులు అధ్యక్షుడు మొయిజ్జు చైనా అనుకూల వైఖరిని ప్రదర్శించడం అని అంటున్నారు విశ్లేషకులు.
ఇదిలా ఉంటే తాజాగా మాల్దీవులు అధ్యక్షుడు మొయిజ్జు తమ దేశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు.. అంతమాత్రం చేత మమ్మల్ని బెదిరించడం తగదు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చైనాలో అయిదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం స్వదేశానికి చేరుకున్నారాయన. ఈ సందర్భంగా భారత్తో తెగిపోయిన దౌత్యంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పరోక్షంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మహా సముద్రంలో మావి చిన్న ద్వీపాలే అయినప్పటికీ.. మాకు సముద్రంలో 9 లక్షల చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి ఉందన్నారు. ఈ మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందదన్నారు. ఇది దీనిచుట్టూ ఉన్న దేశాలన్నింటికీ హక్కు ఉంటుందన్నారు. మేము ఏదో ఒక దేశం కింద లేమన్నారు. మాది కూడా ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది. రాజకీయ పరిణామాలు ఎన్ని ఉన్నా.. బైకాట్ మాల్దీవులు పేరుతో నేటికీ చాలా మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..