PM Modi: ప్రధాని మోదీవి ఆదర్శ భావాలు.. మహారాజా జంసాహెబ్ నవానగర్ కీలక ప్రకటన..

|

Aug 21, 2024 | 10:20 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోలాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వార్సాలోని జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ (ది డోబ్రీ మహారాజా మెమోరియల్) మెమోరియల్ వద్ద నివాళులర్పించారు.. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నవనగర్ దిగ్విజయ్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ జడేజా కీలకంగా వ్యవహరించి.. ఎందరికో దేవుడిగా మారారు..

PM Modi: ప్రధాని మోదీవి ఆదర్శ భావాలు.. మహారాజా జంసాహెబ్ నవానగర్ కీలక ప్రకటన..
Pm Modi
Follow us on

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోలాండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వార్సాలోని జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ (ది డోబ్రీ మహారాజా మెమోరియల్) మెమోరియల్ వద్ద నివాళులర్పించారు.. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నవనగర్ దిగ్విజయ్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ జడేజా కీలకంగా వ్యవహరించి.. ఎందరికో దేవుడిగా మారారు.. వేలాది మందికి ఆశ్రయం కల్పించారు.. దీంతో ఆయన్ను జంసాహెబ్‌ గా గౌరవించారు. పోలాండ్ పర్యటనలో భాగంగా.. ది డోబ్రీ మహారాజా మెమోరియల్ దగ్గర నివాళులర్పించిన ప్రధాని మోదీ నవనగర్ దిగ్విజయ్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ జడేజా కుటుంబసభ్యులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు.

అయితే.. పోలాండ్‌లోని తన కుటుంబ సభ్యులతో ప్రధాన మంత్రి సంభాషించడం, వార్సాలోని జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ మెమోరియల్ వద్ద నివాళులర్పించడంపై మహారాజా జంసాహెబ్ నవానగర్.. తన ఆనందాన్ని పంచుకున్నారు. “గుడ్ మహారాజా” దిగ్విజయ్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ జడేజాకు అద్దం పట్టే స్ఫూర్తి.. మానవత్వాన్ని ప్రతిబింబించే ప్రధానమంత్రి ఆలోచనాత్మకమైన భావాలు.. ఆదర్శమంటూ.. ఆయన ప్రధాని మోదీని ప్రశంసించారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు వివరించారు.

నవనగర్ మహారాజా దిగ్విజయ్‌సిన్హ్జీ రంజిత్‌సిన్హ్జీ జడేజా విగ్రహం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వందలాది మంది పోలిష్ పిల్లలకు ఆశ్రయం కల్పించాలనే నిర్ణయానికి గుర్తుగా నిర్మించారు. పోలాండ్‌లోని శత్రుషియసిన్హ్జీ దిగ్విజయ్సింకీ జడేజా కుటుంబంతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడటం ఆనందాన్ని కలిగించిందంటూ ఈ సందర్భంగా మహారాజా జంసాహెబ్ నవనగర్ ప్రకటనలో తెలిపారు.

వ్రాతపూర్వక సందేశంలో.. అతను పోలిష్ ప్రజలు అనుభవించిన అనూహ్యమైన పరిస్థితులు.. కష్టాలు గురించి చర్చించారని తెలిపారు.. “గుడ్ మహారాజా” దిగ్విజయ్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ జడేజాకు అద్దం పట్టే స్ఫూర్తి, మానవత్వాన్ని ప్రతిబింబించే ప్రధానమంత్రి ఆలోచనాత్మకమైన విధానాలను ఆయన ప్రశంసించారు. భారతదేశం – పోలాండ్ ప్రజల మధ్య వారసత్వాన్ని నిర్మించడానికి, చారిత్రక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల మధ్య యువత, విద్యార్థి, సాంస్కృతిక మార్పిడిని ఏర్పాటు చేయాలని ప్రధానిని అభ్యర్థించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

పోలాండ్‌లోని వార్సాలోని జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ స్మారక చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. ట్వీట్ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..