Joe Biden: భారత్‌తో సంబంధాలపై బైడెన్ ఫోకస్.. ఆ విషయంలో కీలక నిర్ణయం..

| Edited By: Phani CH

May 27, 2021 | 12:48 PM

ఇండియాలో తమ దేశ కొత్త రాయబారిగా లాస్ ఏంజిలిస్ మేయర్ ఎరిక్ గర్సెట్టి ని నియమించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యోచిస్తున్నారు.

Joe Biden: భారత్‌తో సంబంధాలపై బైడెన్ ఫోకస్.. ఆ విషయంలో కీలక నిర్ణయం..
Los Angeles Mayor Is Joe Biden's Choice
Follow us on

ఇండియాలో తమ దేశ కొత్త రాయబారిగా లాస్ ఏంజిలిస్ మేయర్ ఎరిక్ గర్సెట్టి ని నియమించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యోచిస్తున్నారు. తనకు రాజకీయంగా నమ్మకస్తుడైన ఈయనకు ఈ పదవిని అప్పగించాలన్న ప్రతిపాదన ఉందని బైడెన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎరిక్ నియామకం గురించి బైడెన్ వచ్చేవారం ప్రకటించే సూచనలున్నాయి. అలాగే చైనాకు తమ దేశ రాయబారిగా నికోలస్ బర్న్స్ , జపాన్ కు రాహమ్ ఇమాన్యుయెల్, ఇజ్రాయెల్ కి టామ్ నైడ్స్ ని నియమించవచ్చునని భావిస్తున్నారు. వీరిలో పలువురు బైడెన్ కి విశ్వాస పాత్రులు… 50 ఏళ్ళ ఎరిక్… బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయనకు కుడిభుజంగా వ్యవహరించారు. ఆయనతో బాటు పలు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. మొదట ఆయనను కేబినెట్ లోకి తీసుకోవాలనుకున్నారని తెలిసింది. ఇండియాకు అమెరికా భారత రాయబారి పోస్టు జనవరి నుంచి ఖాళీగా ఉంది. తాత్కాలిక రాయబారిగా ఫారిన్ సర్వీస్ ఇన్స్ టిట్యూట్ డైరెక్టర్ డేనియల్ స్మిత్ ను నియమించినప్పటికీ పూర్తి స్థాయి రాయబారి లేరని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఎరిక్, బుర్న్స్ నియామకాలపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్ నిరాకరించింది. మొదట ఈ ప్రతిపాదనలను సెనేట్ ధృవీకరించాల్సి ఉందని బైడెన్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

వివిధ దేశాలకు రాయబారులను నియమించాలన్న ప్రతిపాదన కొంతకాలంగా ఉందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియాకు తమ దేశ రాయబారిగా ఎరిక్ సమర్థంగా వ్యవహరించగలరని బైడెన్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే వైట్ హౌస్ మాత్రం ప్రస్తుతానికి ఏదీ ఫైనల్ కాదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. భారత్ తో స్నేహ సంబంధాలను కొనసాగించడంలో ఎరిక్ తోడ్పడగలుగుతారని బైడెన్ భావిస్తున్నా ఆయన నియామకానికి సెనేట్ అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చేపల మధ్య క్రేజీ ఫైటింగ్.! ఎక్కడా చూసిండరు.! వైరల్‌ అవుతున్న వీడియో..

MEIL: విపత్తు వేళ తమిళనాడుకు మేఘా ఆపన్న హస్తం.. 72 గంటల్లోనే 5వందల బెడ్స్‌‌తో ఆస్పత్రి ఏర్పాటు