లండన్ లోని ఇండియన్ హై కమిషన్ వద్ద ఓ అసాధారణ ఘటన చోటుచేసుకంది. కొంతమంది ఖలిస్థాని జెండాలు పట్టుకుని వచ్చిన వారు అక్కడ ఉన్న భారతదేశ జాతీయ జెండాను కిందకి లాగేశారు. ఖలిస్థాన్ కు మద్ధతుగా నినాదాలు చేశారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అందులో ఓ ఖలిస్థాని మద్ధతుదారుడు ఇండియా హౌస్ భవనంపై ఎక్కి జతీయ జెండాను కిందకి లాగాడు. ఇది గమనించిన ఓ ఇండియన్ అధికారి ఆ నిరసనకారుల నుంచి జెండాను లాక్కున్నారు. ఈ సంఘటనపై విదేశి వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో న్యూ ఢిల్లీలో ఉన్న యూకే దౌత్యవేత్తను ఆదివారం సాయంత్రం పిలిపించింది. లండన్ లో ఖలిస్థాన్ మద్ధతుదారుల చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇండియన్ హై కమిషన్ ప్రాంగణంలో బ్రిటీష్ భద్రతా సిబ్బంది లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. యూకే ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే భారత్ లో ఖలిస్థాన్ నాయకుడు అమ్రిత్ పాల్ సింగ్ పై దృష్టి సారించినందుకే అతనికి మద్దతు తెలిపేలా ఇలాంటి పని చేసినట్లు తెలుస్తోంది.
#WATCH | United Kingdom: Khalistani elements attempt to pull down the Indian flag but the flag was rescued by Indian security personnel at the High Commission of India, London.
(Source: MATV, London)
(Note: Abusive language at the end) pic.twitter.com/QP30v6q2G0
— ANI (@ANI) March 19, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం